Home /News /trending /

PIGEON TRAVEL 6000 KMS REACH AMERICA FROM BRITIN BY MISTAKE PVN

Pigeon Travel To USA : 6వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ అమెరికా వెళ్లిన పావురం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pigeon Travel To USA : ప్రజలు తమ పెంపుడు పక్షులను ముఖ్యంగా పావురాలను(Pigeon) తమ సందేశం ఇస్తూ వేరే ప్రాంతాలకు ఎలా పంపిస్తారో మనం గతంలో సినిమాలో చూసేవాళ్లం. ఇప్పుడయితే మన దాయాది దేశం పాకిస్తాన్ నిత్యం మనదేశంలోకి పావురాల ద్వారా ఇక్కడున్న తమ సానుభూతిపరులకు సందేశాలు, ఆయుధాలు పంపుతున్న విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
Pigeon Travel To USA : ప్రజలు తమ పెంపుడు పక్షులను ముఖ్యంగా పావురాలను(Pigeon) తమ సందేశం ఇస్తూ వేరే ప్రాంతాలకు ఎలా పంపిస్తారో మనం గతంలో సినిమాలో చూసేవాళ్లం. ఇప్పుడయితే మన దాయాది దేశం పాకిస్తాన్ నిత్యం మనదేశంలోకి పావురాల ద్వారా ఇక్కడున్న తమ సానుభూతిపరులకు సందేశాలు, ఆయుధాలు పంపుతున్న విషయం తెలిసిందే. పావురాలు కూడా చాలా తెలివిగాప్రయాణించి సందేశాన్ని అందిస్తున్నాయి. అయితే ఓ పావురం ఇప్పుడు ఎగురుకుంటూ ఏకంగా 6వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో దేశానికి వెళ్లిపోయింది. అయితే అది ఎవరికో సందేశాన్ని ఇచ్చేందుకు వెళ్లలేదు..పొరపాటున వెళ్లిందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో కూడా చర్చనీయాంశంగా మారింది.

60 ఏళ్ల అలాన్ టాడ్... బ్రిటన్‌లోని గేట్స్‌హెడ్‌లోని బ్లైడన్‌లో నివసిస్తున్నారు. అతడు ఓ పావురాన్ని పెంచుకుంటున్నాడు. దానికి బాబ్ అనే పేరు పెట్టుకున్నాడు. ఓ రోజు బాబ్ కనిపిచకుండా పోయింది. గ్వెర్న్సీ అనే ద్వీపం నుండి తన యజమాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి పొరపాటున..6 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అమెరికా చేరుకుంది. అయితే తన పావురం జాడ కోసం స్వదేశంలో అలాన్ టాడ్ వెతకని చోటు లేదు. అయితే బాబ్ ఆచూకీ కనిపించలేదు. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ...బాబ్ ఎక్కడుందనే జాడ తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత... బాబ్ అలబామాలో ఉన్నట్లు అమెరికా నుండి అలాన్‌కి మెయిల్ వచ్చింది. ఇది విన్న అలన్ ఆశ్చర్యపోయాడు. ఆనందంతో ఎగిరి గంతేసాడు. వాస్తవానికి బాబ్(పావురం)అలబామాలో ఒక వృద్ధుడి తోటలో కూర్చుని కనిపించింది. తోట యజమాని బాబ్ ని అక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా తోట నుంచి అది పారిపోలేదు, అప్పుడు ఆ తోట యజమాని జంతు స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. వారు బాబ్ మెడలో ఉన్న బ్యాండ్, మైక్రోచిప్‌ తో.. అలాన్‌ ను ట్రాక్ చేసి అతనికి మెయిల్ చేశారు.

Viral Video : చిరుత వేగం చూడాలంటే దీనిని మించిన వీడియో ఉండదేమో!

అలాన్ బాబ్‌ని ఇంటికి తీసుకెళ్లాడు
6 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన బాబ్ అక్కడికి ఎలా చేరుకున్నదని ఆశ్చర్యపోయానని అలాన్ చెప్పాడు - బాబ్ ఐర్లాండ్‌లో ఉన్నాడని, అక్కడి నుండి తిరిగి వస్తదని అనుకున్నాను, కానీ తిరిగి రాకపోవడంతో నా ఆందోళన పెరిగింది. పావురాలను పోగొట్టుకున్నప్పుడు వాటి పరిస్థితి ఏమై ఉంటుందోనన్న ఆందోళన కలుగుతోందని. ఒక్కోసారి అవి చనిపోతుంటాయి కూడా. బాబ్ ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఎగురుతున్నప్పుడు తుఫానులో చిక్కుకుని ఉండవచ్చని అలెన్ ఊహించాడంట. అయితే బాబ్ ఆచూకీ దొరకడంతో అలెన్..తన పెంపుడు పావురాన్ని ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. అయితే, పక్షిని తీసుకురావడానికి అలెన్‌కు రూ. 2.8 లక్షల వరకు ఖర్చవుతుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Birds, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు