విమానంలో పావురం.. షాకైన ప్రయాణికులు.. వీడియో వైరల్

కొందరు ఔత్సాహికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు మహిళలు మాత్రం టెన్షన్ పడ్డారు. ఇంకొందరు పావురం చేసిన పనిని చూసి నవ్వకుంటూనే.. మొబైల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు.

news18-telugu
Updated: February 29, 2020, 2:13 PM IST
విమానంలో పావురం.. షాకైన ప్రయాణికులు.. వీడియో వైరల్
విమానంలో పావురం
  • Share this:
రన్‌వే టేకాఫ్‌కు విమానం సిద్ధంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయానికి విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో గానీ.. ఓ పావురం రివ్వున ఎగిరింది. అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కొందరు ఔత్సాహికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు మహిళలు మాత్రం టెన్షన్ పడ్డారు. ఇంకొందరు పావురం చేసిన పనిని చూసి నవ్వకుంటూనే.. మొబైల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ గోకు చెందిన G-8702 విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

చివరకు క్యాబిన్ క్రూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి విండో క్యాబిన్ ఓపెన్ చేసి పావురాన్ని బయటకు పంపించారు. ఈ పావురం కారణంగా విమానం అరగంట ఆలస్యమైంది. 06.15కు జైపూర్‌కు చేరుకోవాల్సిన విమానం.. 06.45కు చేరుకుంది. విమానంలో పావురం సందడిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది వైరల్‌గా మారింది.

Published by: Shiva Kumar Addula
First published: February 29, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading