13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క.. గాలి ఆడక ఆ చిన్నారి...

13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క

పేరెంట్స్ జాగ్రత్త... మీ పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ఎక్కువ కేర్ తీసుకోండి. ఈ చిన్నారి విషయంలో ఏం జరిగిందో మనం తప్పక తెలుసుకోవాలి. పూర్తి వివరాలు ఇవీ.

 • Share this:
  మధ్యప్రదేశ్... జబల్పూర్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు... ఓ అరుదైన కేసును డీల్ చేశారు. 13 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడారు. కట్నీలో నివసిస్తున్న దీపక్ రాజ్ కూతురు షనాయా. కొన్ని రోజులుగా చిన్నారి రోజూ ఏడూస్తూనే ఉంటోంది. ఏడుపు ఆపించడానికి రకరకాల బొమ్మలు ఇచ్చారు. అటూ ఇటూ ఎత్తుకొని తీసుకెళ్లి.. అన్నీ చూపించారు. లాలించారు, ఆడిపాడించారు... ఎన్ని చేసినా చిన్నారి ఏడుపు మాత్రం ఆపట్లేదు. ఏదో చెప్పాలనుకుంటోంది... చెప్పలేకపోతోంది... తల్లిదండ్రులకేమో అర్థం కావట్లేదు. ఓ దశలో చిన్నారి ఏడుపు చూసి... వాళ్లకూ చిరాకొచ్చింది. అదే పనిగా ఇలా ఏడిస్తే ఎలా అని కసురుకున్నారు. అప్పుడు పక్కింటి వాళ్లకు డౌట్ వచ్చింది. కంటిన్యూగా ఏడుస్తోందంటే... సంథింగ్ ఏదో జరిగినట్లే... ఆస్పత్రికి తీసుకెళ్లండి... లైట్ తీసుకోవద్దు అని సలహా ఇచ్చారు. దాంతో వాళ్ల మాట విని... ఆస్పత్రికి తీసుకెళ్లారు.

  ఆస్పత్రిలో చిన్నారి సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతోంది అని డాక్టర్లు గుర్తించారు. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు డాక్టర్ కవిత సత్యదేవ ఎండోస్కోపీ చేశారు. షాకింగ్ విషయం తెలిసింది. పాప ఊపిరి తిత్తులకు గాలి వెళ్లే గొట్టంలో ట్రాచియా (Trachea) ప్రాంతంలో (గొంతు ప్రాంతంలో) పచ్చిమిర్చి ముక్క ఒకటి ఇరుక్కుపోయింది. దాంతో చిన్నారికి గాలి సరిగా ఆడట్లేదు. ఈ విషయం తెలియగానే డాక్టర్లకు టెన్షన్ పెరిగింది.

  అసలు 13 నెలల పిల్లకి... పచ్చిమిర్చి ఎలా పెట్టారు అని తల్లిదండ్రులను అడిగితే... పాపకు దంతాలు వచ్చాయి కదా అని పెట్టాం అని చెప్పారు పేరెంట్స్. వెంటనే డాక్టర్లు పాపకు స్పెషల్ ఆపరేషన్ చేశారు. నానా తిప్పలు పడి ఆ పచ్చిమిర్చి ముక్కను బయటకు తీశారు. దాంతో పాపకు మళ్లీ ఊపిరి ఆడటం మొదలైంది. ఆపరేషన్ ఆలస్యమైవుంటే చిన్నారి చనిపోయేదే అని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం పాపను పిడియాట్రిక్ వార్డులో 2 రోజులు ఉంచుతామని చెప్పారు. ఆ తర్వాత అంతా బాగానే ఉంటే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

  ఇది కూడా చదవండి: ప్రియుడితో సంబంధం.. అడ్డుగా మూడేళ్ల చిన్నారి.. కూరగాయల కోసం వెళ్లి ఏం చేసిందంటే...

  ఇదీ జరిగింది. ఓ చిన్న పచ్చిమిర్చి ముక్క పాప ప్రాణాలకే ముప్పు తెచ్చింది. పేరెంట్స్... పిల్లలకు దంతాలు వచ్చినా... వెంటనే అన్నీ పెట్టేయకండి... ఆహారాన్ని పేస్టులా చేసి పెట్టడమే మేలు అంటున్నారు డాక్టర్లు.
  Published by:Krishna Kumar N
  First published: