news18-telugu
Updated: November 17, 2020, 12:22 PM IST
ప్రతీకాత్మకచిత్రం
కేంద్ర ప్రభుత్వం 7 లక్షల రూపాయల డబ్బును విద్యార్థుల బ్యాంకు ఖాతాలో వేయనుందని యూట్యూబ్లో ఒక వార్త ఎక్కువగా వైరల్ అవుతోంది. 'జీవన్ లక్ష్య యోజన' కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ. 7 లక్షలు ఇస్తున్నట్లు వైరల్ వార్తల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ వార్తను విచారించినప్పుడు, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మోసం చేయడానికి ఇలాంటి అనేక వార్తలు రోజు వైరల్ అవుతున్నాయి, వీటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
'జీవన్ లక్ష్య యోజన' కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరి బ్యాంకు ఖాతాల్లో రూ .7 లక్షలు ఇస్తోందని ఈ వార్త పూర్తిగా నకిలీదని భారత ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పిఐబి ఫాక్ట్ చెక్ స్పష్టంగా తెలిపింది. పిఐబి ప్రకారం, భారత ప్రభుత్వం ఎక్కడా అలాంటి ప్రకటన చేయలేదని ప్రభుత్వం అలాంటి పథకాన్ని అమలు చేయలేదు.
Published by:
Krishna Adithya
First published:
November 17, 2020, 12:22 PM IST