కొన్ని అంతే అస్సలు అర్థం కావు. అది మ్యాజిక్కా..? సైన్సా? అనేది అంతు చిక్కదు. ఇది కూడా అలాంటిదే. టూత్ పిక్..నిండు వాటర్ బాటిల్ బరువును మోస్తుందా..? అంటే ఏ చెబుతారు. అంత సీన్ లేదు. అది సాధ్యం కాదు అని చెబుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇది చేసి చూపించాడు. ఓ టేబుల్ అంచున టూత్ పిక్‌ను పెట్టి.. దానికి బాటర్ బాటిల్‌ను వేలాడదీశాడు. అప్పుడు టూత్‌పిక్‌తో పాటు వాటర్ బాటిల్ పడిపోవాలి. కానీ అలా జరగలేదు. వాటర్ బాటిల్ బరువును టూత్ పిక్ మోసింది. ఆ వాటర్ బాటిల్ గాల్లో అలాగే వేలాడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొదట ఆ వ్యక్తి టూత్ పిక్‌ను టేబుల్ అంచున పెట్టాడు. దానిపై పాలతో నింపిన క్యాన్‌ను ఉంచాడు. ఆ బరువుతో అది కిందపడకుడా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ టూత్ పిక్కు వాటర్ బాటిల్ వేలాడ దీశాడు. తాడు మధ్య మరో టూత్ పిక్ ఉంచి.. టేబుల్‌పై ఉన్న టూత్ పిక్కు 90 డిగ్రీల కోణంలో మరో టూత్‌పిక్‌ను పెట్టాడు. ఆ తర్వాత మెల్లగా టేబుల్‌పై ఉన్న పాల క్యాన్‌ను తీసేశాడు. అలాచేస్తే ఏం జరగాలి? టూత్ పిక్‌తో పాటు వాటర్ బాటిల్ కూడా కిందపడిపోవాలి. కానీ వాటర్ బాటిల్ అలాగే ఉండిపోయింది.
ఐతే ఇందులో మ్యాజిక్ లేమీ లేదని.. సైన్స్ దాగుందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Published by:Shiva Kumar Addula
First published:July 03, 2020, 22:40 IST