Unusual Fish: బాబోయ్ ఇదేం వింత.. ముఖం చూస్తే పంది, ఆకారం చూస్తే సొర చేప..!

Image Credit : News Flash

Unusual Fish: సముద్ర జలాల్లో ఈ వింత చేప తేలుతూ కనిపించిందట. దీన్ని బయటకు తీసిన నావికులు, ఆ జీవిని దగ్గరి నుంచి చూసి ఆశ్చర్యపోయారట. ఒక సొరచేపకు పంది ముఖం పెట్టిన కార్టూన్ మాదిరిగా అది కనిపిస్తోంది.

  • Share this:
వింత ఆకారం ఉన్న ఒక సముద్రపు జీవిని కనుగొన్నారు కొందరు ఇటాలియన్ నావికులు. చూడటానికి భారీ చేపలా కనిపిస్తున్న ఆ ప్రాణిని, ముందు నుంచి చూస్తే పందిలా కనిపిస్తోంది. చేప, పంది ఆకారాల కలయికతో కనిపిస్తున్న ఈ వింతజీవి ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఎల్బా అనే ఇటాలియన్ ద్వీపంలోని దర్సేనా మెడిసియా సముద్ర జలాల్లో ఈ వింత చేప తేలుతూ కనిపించిందట. దీన్ని బయటకు తీసిన నావికులు, ఆ జీవిని దగ్గరి నుంచి చూసి ఆశ్చర్యపోయారట. ఒక సొరచేపకు పంది ముఖం పెట్టిన కార్టూన్ మాదిరిగా అది కనిపిస్తోంది. అయితే ఆ చేప ఆక్సినోటస్ సెంట్రినా జాతికి చెందిన యాంగులర్ రఫ్‌షార్క్ అని తేలింది. సముద్రం అడుగున జీవించే ఈ చేపలను స్థానికులు పిగ్ షార్క్ అని పిలుస్తారు.

ఈ రఫ్‌షార్క్ జాతిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రమాదంలో ఉన్న జీవజాతుల జాబితాలో చేర్చింది. ఇవి చాలా అరుదుగా సముద్ర ఉపరితలాల్లోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు.

Photo Credit : News Flash


ఆగస్టు 19నే అక్కడి నావికులు ఈ చేపను గుర్తించారు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన అప్పటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆకారం వింతగా ఉండటంతో.. నావికులు ఆ చేపను హార్బర్ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ దాన్ని అధికారులు పరిశీలించి, మళ్లీ సముద్రంలో విడిచిపెట్టారు.

ఇది కూడా చదవండి : ఐదో టెస్ట్ రద్దు వల్ల భారత్ కు లాభమా? నష్టమా..? మరీ WTC పాయింట్ల సంగతేంటి..?

* ఆ జీవికి ఎన్నో ప్రత్యేకతలు
ఈ జీవులు నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు పంది అరిచినట్లు శబ్దాలు చేస్తాయట. అందుకే వీటిని ‘పిగ్ ఫిష్’ అని పిలుస్తారు. స్థానిక టస్కాన్ ద్వీపాల వద్ద జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రఫ్‌ షార్క్స్‌ కనిపిస్తుంటాయి. ఫిషింగ్ నెట్స్‌లో కూడా ఇవి అప్పుడప్పుడూ చిక్కుకుంటాయి.

ఇది కూడా చదవండి : తన ప్రేయసి కారణంగానే ఇషాన్ కిషన్ టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడా..?

అయితే వాటిని మళ్లీ సముద్రంలోకి విడిచిపెడుతుంటారు. పెద్ద అక్వేరియం ట్యాంక్‌లలో వాటిని పెంచేందుకు కొందరు ఔత్సాహికులు గతంలో ప్రయత్నించారు. అయితే బంధించినట్లు ఉండే వాతావరణంలో అది బతకలేదని పరిశోధకులు తేల్చారు. అరుదైన, అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలో ఉండటం వల్ల వీటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published: