Home /News /trending /

PHOTOS FROM A DOMINOS OUTLET IN BENGALURU WHEREIN CLEANING MOPS WERE HANGING ABOVE TRAYS OF PIZZA DOUGH WHICH GOES VIRAL GH SRD

Domino’s India: ఇదే నా పరిశుభ్రత.. డొమినోస్ పిజ్జా ట్రేలపై టాయిలెట్ బ్రష్.. ట్విట్టర్‌‌లో వైరల్..

Photo Credit Twitter

Photo Credit Twitter

Domino’s India: ఇటాలియన్ రుచికరమైన పిజ్జాకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. దీని పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది. అయితే ఇటీవల పిజ్జాలకు సంబంధించిన ఓ ఫోటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. అది చూస్తే మీకు వికారంగా అనిపించక మానదు. 

ఇటాలియన్ రుచికరమైన పిజ్జాకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. దీని పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంది. అయితే ఇటీవల పిజ్జాలకు సంబంధించిన ఓ ఫోటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. అది చూస్తే మీకు వికారంగా అనిపించక మానదు. బెంగళూరు(Bengaluru)లోని డొమినోస్ (Domino’s India) ఔట్ లెట్లలో ఒకదాంట్లో పిజ్జా ట్రేలపైన టాయిలెట్ బ్రష్, మాప్స్, వస్త్రాలు వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తుషార్ అనే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఫోటోను షేర్ చేస్తూ తుషార్ ఇలా ట్వీట్ చేశారు.. ప్రతి ఒక్కరూ దుకాణంలో కొనుగోలు చేసిన ఫుడ్ కంటే ఇంట్లో తయారుచేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బెంగళూరులోని డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా ట్రేల పైన క్లీనింగ్ మాప్స్, టాయిలెట్ బ్రష్, బట్టలు వేలాడదీయడం చూడవచ్చు. దయచేసి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇష్టపడండి అని పేర్కొన్నారు.

* ఇదేనా పరిశుభ్రత?
ఈ ఫోటోలు చూసిన పిజ్జా లవర్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. డొమినోస్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇంతలో మరో ట్విట్టర్ యూజర్ ఆహారాన్ని భయకరమైన పరిస్థితుల మధ్య ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియో ఒకటి షేర్ చేశారు.



మరో ట్విట్టర్ యూజర్ ఇలా స్పందించారు..ఈ పిజ్జాకు విటమిన్ A,B,C,E,F,G,H,I,J,K,L యాడ్ అయ్యాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్, క్రోమియం, రాగి, ఫ్లోరైడ్, మాంగనీస్, సెలీనియం, బీటా-కెరోటిన్, లుటీన్, లైకోపీన్, థయామిన్, రిబోఫ్లావిన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి అంటూ వ్యంగ్యంగా రాశారు.


కవిరాజ్ పటేల్ అనే ఇంకో ట్విట్టర్ యూజర్ ఇలా స్పందించారు.. ‘డైనింగ్ ఏరియాలోని కస్టమర్‌లకు వంటగది పరిసరాలను సీసీటీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రదర్శించాలి. దీంతో యాజమాన్యం పరిశుభ్రతపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి.’ అని విజ్ఞప్తి చేశారు.


మరో ట్విట్టర్ యూజర్ పూర్ణిమా..‘మీరు పరిశుభ్రమైన ప్రమాణాలను ఈ విధంగా నిర్వహిస్తారా? ఆహార నాణ్యత, పరిశుభ్రతపై మీరు చూపే శ్రద్ధ ఇదేనా?అంటూ డొమినోస్ను ప్రశ్నించారు.




* నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నాం
ఈ ఘటనపై డొమినోస్ ఇండియా స్పందిస్తూ..‘పరిశుభ్రత, ఆహార భద్రతలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. ఇందుకు కఠినమైన ప్రపంచ స్థాయి ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉన్నాం. ఈ ఆపరేటింగ్ ప్రమాణాలను ఉల్లంఘిస్తే అసలు సహించం. ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపడతాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. కస్టమర్ల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి అవసరమైన ప్రతిదాన్ని చేయడానికి మేం కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాం’ అంటూ ఓ ప్రకటన జారీ చేసింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Bengaluru, Pizza, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు