పాత కంప్యూటర్‌ను కెమెరాగా మార్చేసిన ఫొటోగ్రాఫర్... ఎలాగంటే...

Computer to Camera : 20 ఏళ్ల నాటి పాడైన కంప్యూటర్‌ను పారేయడం ఇష్టంలేని ఆ ఫొటోగ్రాఫర్‌కి దాన్నే కెమెరాగా మార్చితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఫలితం అదిరిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 2:54 PM IST
పాత కంప్యూటర్‌ను కెమెరాగా మార్చేసిన ఫొటోగ్రాఫర్... ఎలాగంటే...
కంప్యూటర్ నుంచీ కెమెరా (Image : Youtube - alireza rostami)
Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 2:54 PM IST
రీసైక్లింగ్, రీయూజింగ్... అన్నది ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలూ కోరుకుంటున్న మంత్రం. దీన్నే తన పాత కంప్యూటర్‌కి అప్లై చేశాడు ఇరాన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ అలిరెజా రోస్టామీ. పాత కంప్యూటర్ పార్టులను విడగొట్టి... కెమెరా తరహాలో సెట్ చేసి... లెన్స్ ఇతరత్రా పార్టుల్ని జత చేశాడు. ఫలితంగా అద్భుతమైన లుక్‌తో కనిపిస్తున్న ఫ్రాంకెన్‌స్టెయిన్ కెమెరా కళ్లముందుకొచ్చింది. పాత వాటిని పారేయకుండా వాడొచ్చనేందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాడు అలిరెజా. 1999లో రోస్టామీ కంప్యూటర్ కొనుక్కున్నాడు. కాలక్రమంలో దానికి చాలా మార్పులు చేశాడు. ఓసారి మదర్ బోర్డ్ కూడా మార్చాడు. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని దానికి సెట్ చేశాడు. కొన్నేళ్ల తర్వాత అది పనిచెయ్యడం మానేసింది. టెక్నాలజీ కూడా పూర్తిగా మారిపోయింది.

కంప్యూటర్ నుంచీ కెమెరా (Image : Youtube - alireza rostami)


కంప్యూటర్‌ను పారేయడం ఇష్టంలేని అలిరెజా... దాన్ని ఇంట్లో ఓ మూల ఉంచాడు. స్వతహాగా ఫొటోగ్రాఫరైన అతను... ఆ కంప్యూటర్‌ను కెమెరాగా మార్చితే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు.

కంప్యూటర్ నుంచీ కెమెరా (Image : Youtube - alireza rostami)
అసలు కెమెరా ఎలా ఉంటుంది? దాన్ని తయారుచేయడానికి... కంప్యూటర్ ఎలా పనికొస్తుంది అని ఆలోచించాడు. రకరకాల ప్రయోగాలు, మార్పులూ చేర్పుల తర్వాత మొత్తానికి విజయవంతంగా కెమెరాను తయారుచేశాడు.

కంప్యూటర్ నుంచీ కెమెరా (Image : Youtube - alireza rostami)


తన వరకూ ఈ ప్రపంచంలో ఏదీ వృథా కాదని అంటున్న రోస్టామీ... తన ప్రాజెక్ట్... యంగ్ జనరేషన్‌కి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Loading...
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...