కుక్క లాంటి ఫేస్‌తో గబ్బిలం... చూసి షాకవుతున్న నెటిజన్లు...

గబ్బిలాల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటి ఫేస్ కుక్కలా ఎప్పుడూ కనిపించదు. మరి ఆ గబ్బిలం ఫేస్ ఎందుకు అలా ఉంది? అది ఏ జాతి?

news18-telugu
Updated: July 4, 2020, 11:02 AM IST
కుక్క లాంటి ఫేస్‌తో గబ్బిలం... చూసి షాకవుతున్న నెటిజన్లు...
కుక్క లాంటి ఫేస్‌తో గబ్బిలం... చూసి షాకవుతున్న నెటిజన్లు... (credit - twitter)
  • Share this:
కరోనా కాలంలో గబ్బిలాల్ని చూసి ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడైనా గబ్బిలాలు చెట్లకు వేలాడుతుంటే... వాటిని తరిమేస్తున్నారు. గబ్బిలాల వల్ల కరోనా వచ్చి ఉంటుందనే అనుమానమే ఇందుకు కారణం. ఐతే... ఇప్పటివరకూ కరోనా ఏ జీవి వల్ల మనుషులకు సోకింతో తెలియలేదు. ఆ విషయం అలా ఉంచితే... ఇప్పుడో గబ్బిలం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకంటే... దాని ముఖం అచ్చం కుక్క ముఖం లాగే ఉంది. అది కుక్క లాంటి ముఖం ఉన్న గబ్బిలమా... లేక... కుక్కే గబ్బిలంలా ఉందా అనే డౌట్ వస్తోంది నెటిజన్లకు. దానికి డాగ్-బ్యాట్ అనే పేరు పెట్టేశారు.


నిజానికి ఇవో రకం జాతి గబ్బిలాలు. వీటి ముఖాలు కుక్కల ముఖాల్లాగే ఉంటాయి. కాకపోతే చిన్న సైజులో ఉంటాయి. అంటే పులిని పోలినట్లుగా పిల్లులు ఉంటాయి కదా... అలాగే ఇవి కూడా. ఈ ఫొటోని ట్విట్టర్ యూజర్ ఎమోషనల్ పెడాంట్ షేర్ చేశారు. ఈ బ్యాట్ పేరు బ్యూటికోఫెర్స్ ఎపాలెట్టెడ్ ఫ్రూట్ బ్యాట్ (Buettikofer's epauletted fruit bat) అని తెలిపారు. గబ్బిల్లాలో ఇవి కాస్త పెద్ద సైజులో ఉంటాయి. కుక్కలతో వీటికి ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. ఇలాంటి గబ్బిలాలు ఇంకా చాలా రకాలున్నాయి. వాటి ఫేస్‌లు కూడా రకరకాలుగా ఉంటాయి.


చూడటానికి కాస్త భయంకరంగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. భయపడుతూనే నెటిజన్లు దీన్ని షేర్ చేసుకుంటున్నారు. చాలా మంది దీని పేరును కాపీ చేసి... గూగుల్‌లో సెర్చ్ చేసి... మరిన్ని ఫొటోలు చూస్తున్నారు. ఎందుకంటే అది కుక్క ముఖంతో ఉండటాన్ని వాళ్లు నమ్మలేకపోతున్నారు.


దేవుడా.. ఏంటిది... నాకు వణుకొస్తోంది. అయినా చూస్తున్నాను. అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. కుక్కలాగే ఉంది కానీ కుక్క కాదే అని మరో యూజర్ అన్నారు. నాకు మరిన్ని ఫొటోలు చూడాలని ఉందని మరో యూజర్ తెలిపారు.


ఆఫ్రికా దేశాలైన ఐవరీ కోస్ట్, గినియా, గినియా బిస్సు, లైబీరియా, నైజీరియా, సెనెగల్, సియెర్రా లియోన్‌లలో ఈ జాతి గబ్బిలాలు ఉంటాయి. అడవులు, పొడి ప్రదేశాల్లో ఇవి ఉంటాయి. సవన్నా గడ్డి ప్రాంతాల్లో కూడా ఉంటాయి.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading