Success Story: పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురికి ఐఐటీలో సీటు.. వైరల్ అయిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ ట్వీట్..

కూరురుతో తండ్రి (ఫైల్)

ఒక స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించిన ఈ యువతిని అభినందించారు.

  • Share this:
నిరంతరం ప్రయత్నిస్తూ, అంకితభావంతో కృషి చేస్తే విజయం దానంతట అదే తలుపు తడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు దృఢ సంకల్పం అవసరం. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) చైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించిన ఈ యువతిని అభినందించారు. కంపెనీలో ప్రతి ఒక్కరూ ఆమె కృషికి, అంకితభావానికి గర్వపడుతున్నారని తెలిపారు.

Viral Video: ఆ బాలుడు చేసే పని.. అందరికీ కన్నీళ్లు పెట్టించాయి.. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడు.. ఎందుకు..?


వివరాల్లోకి వెళ్తే.. ఆర్య రాజగోపాలన్ తండ్రి రెండు దశాబ్దాలుగా కేరళలో పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి బజాజ్ మోటార్స్ లో వర్కర్ గా పనిచేస్తున్నారు. ఎన్నో ఆర్థిక సమస్యల నడుమ తమ కూతురును పెద్ద చదువులు చదివించాలని వారు భావించారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. తండ్రిది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఆర్య చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. ఎన్ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న ఆమె.. ఎంటెక్‌ను ఐఐటీ కాన్పూర్ నుంచి పూర్తి చేయనుంది. అక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సు చదవనుంది.


Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..


పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటోను కూడా ఐఓసీ చైర్మన్ షేర్ చేశారు. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆర్య రాజగోపాలన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల ఆ తండ్రి కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆర్య విజయాన్ని కొనియాడుతున్నారు.


Video Viral: అయ్యో.. ఎంత కష్టం వచ్చిందో నవ వధువుకు.. అత్తింటికి వెళ్లలేక ఆమె ఏం చేసిందో చూడండి..


నెటిజన్లే కాకుండా ప్రముఖులు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు. ఆమె విజయం.. ఇంధన రంగానికి సంబంధించిన తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. తండ్రి, కూతుళ్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, తండ్రి కష్టాన్ని చూస్తూ చదువుకున్న ఆర్య ఈ రోజు తన తండ్రి గర్వపడే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. అందరూ కలలు కనే ఐఐటీలో సీటు దక్కించుకుని ఎంతో మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

కూతురు విజయానికి ప్రశంసలు రావడంతో ఆమె తండ్రి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె భవిష్యత్తు కోసం తాను పెట్టుకున్న ఆశలు వమ్ముకాలేదని అన్నారు. ఇండియన్ ఆయిల్ చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి తాను ఇదే కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పారు.
Published by:Veera Babu
First published: