Home /News /trending /

PETROL PRICE CUT BY MASSIVE RS 25 A LITRE IN JHARKHAND FOR TWO WHEELERS CM HEMANT SOREN ANNOUNCES FULL DETAILS HERE MKS

Petrol price సంచలనం: లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు.. ఆ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే..

పెట్రోల్ ధర భారీ తగ్గింపు

పెట్రోల్ ధర భారీ తగ్గింపు

పెట్రో ధరల దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్న తరుణంలో గొప్ప ఊరటనిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్రోల్ ధరలను ఒక లీటరుపై రూ.25 తగ్గింపు ప్రకటించారు సీఎం హేమంత్ సోరెన్. అయితే ఈ తగ్గింపు అందరికీ వర్తించదు. ఇందుకోసం మార్గదర్శకాలు ప్రకటించారు..

ఇంకా చదవండి ...
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలతో సంబంధం లేకుండా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కల్లో విహరిస్తుండటం, ఇధన ధరలకు అనుగుణంగా నిత్యావసరాల ధరలూ పైపైకి వెళుతుండటం, ఈ అంశంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోన్న దరిమిలా కేంద్రం కొంత మేరకు పన్నులు తగ్గించడం, అయినా కూడా ధరలు ఇంకా దిగిరాకపోవడం లాంటి పరిణామాల మధ్య మరో సంచలనం చోటుచేసుకుంది. జార్ఖండ్ ప్రభుత్వం లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 తగ్గింపును ప్రకటించింది. పెట్రో భారం వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలు కుదేలవుతున్నారంటూ, తన పరిపాలన రెండో వార్షికోత్సవం సందర్బంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బుధవారం నాడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే తగ్గించ ధరలు అందరికీ వర్తించవు. టూ వీలర్ కలిగిన పేద, మధ్యతరగతి వారికి మాత్రమే చవక పెట్రోల్ అందనుంది. వివరాలివి..

పెట్రో ధరల దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్న తరుణంలో గొప్ప ఊరటనిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్రోల్ ధరలను ఒక లీటరుపై రూ.25 తగ్గింపు ప్రకటించారు సీఎం హేమంత్ సోరెన్. ‘పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 25 ఉపశమనం కల్పించింది. ఈ ప్రయోజనం వచ్చే ఏడాది 26 జనవరి నుంచి అందుబాటులోకి వస్తుంది..’అని సీఎం తెలిపారు. అయితే,

Cotton : తెల్లబంగారానికి అదిరిపోయే ధర.. పత్తి క్వింటాల్‌ రూ.9 వేలు.. వరి వద్దన్నందుకు భలే గిరాకీ..



జార్ఖండ్ లో పెట్రోల్ ధరల తగ్గింపు అందరికీ వర్తించదు. అలాగని ప్రత్యేకమైన బంకుల ద్వారా సరఫరా లాంటిది కూడా జరగదు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల్లో ద్విచక్ర వాహనం ఉన్నవాళ్లకు మాత్రమే.. అది కూడా రేషన్ కార్డు ఉంటేనే రూ.25 తగ్గింపుతో పెట్రోల్ లభిస్తుంది. రేషన్ కార్డు కలిగిన వాహనదారులు మార్కెట్ ధరకే బండ్లలో పెట్రోల్ కొట్టించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభఉత్వం వారి బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీని జమ చేస్తుంది..

రేషన్ కార్డు కలిగిన ద్విచక్ర వాహనదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.25 సబ్సిడీని జమ చేస్తారు. అయితే, ఒక్కో వాహనదారుడు రూ.25 తగ్గింపుపై లభించే పెట్రోల్ నెలకు 10 లీటర్లు మాత్రమే పొందే వీలుంటుంది. పెట్రోల్ ధరల పెంపు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా హేమంత్ సర్కారు ఈ పథకాన్ని ప్లాన్ చేసింది. జనవరి 26 నుంచి అమల్లోకి రానున్న పెట్రోల్ ధరల తగ్గింపుపై మరిన్ని మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.

Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్



దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు బుధవారం (డిసెంబర్ 29) కూడా అలాగే ఉన్నాయి. దీపావళి సమయంలో కేంద్రం.. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ధరల్లో పెద్దగా మార్పులేవీ చోటుచేసుకోలేదు. బుధవారం నాడు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం పోర్ట్ బ్లెయిర్‌లో మాత్రం పెట్రోల్ రూ. 82.96, డీజిల్ రూ. 77.13గా ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Jarkhand, Petrol price, Petrol rate

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు