Home /News /trending /

PETROL DIESEL PRICES TO INCREASE TODAY HIKE LIKELY RS 15 PER LTR BY MARCH END AS ASSEMBLY ELECTION ENDS TODAY AND UKRAINE WAR ALSO MKS

ఈరోజు పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేశారా? ఇంకొన్ని గంటల్లో షాక్ తప్పదు! Petrol Diesel Price రూ.20 పెంపు!!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ్టితో(సోమవారంతో) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఖాయమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు రూ.130 డాలర్లు దాటింది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.20 పెరగొచ్చు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయినాసరే, భారత్ లో మాత్రం గడిచిన నెలన్నరగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. కారణం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2022). అయితే, ఇవాళ్టితో(సోమవారంతో) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగియనుండటంతో పెంపు ఖాయంగా కనిపిస్తోంది. నేటి సాయంత్రం 5 గంటలకు చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఆయిల్ కంపెనీలు ధరల పెంపును (Petrol Diesel Price Hike) ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తంగా మార్చి చివరి నాటికి పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.15 నుంచి రూ.20కు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మూడో వారంలోకి ప్రవేశించడం, దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతుండటం, రష్యాపై ఆంక్షలు గంటగంటకూ పెరుగుతోన్న క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ప్రభావం ఇండియాపైనా పెనుభారం కానుంది. నిజానికి క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగినా దాదాపు నెలన్నరగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. సోమవారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తుండటంతో ఇవాళ్టి నుంచి ధరల పెంపు మొదలుకానుంది. మార్చి చివరినాటికి ఇంధన ధరలు లీటరు రూ.20 వరకు పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవాళ..

మాంసం ప్రియులకు షాక్: భారీగా పెరిగిన చికెన్ ధర.. 1కిలో రూ.300 -రాబోయే రోజుల్లో కొండెక్కడం ఖాయం!


తాజా రిపోర్టుల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు 130 డాలర్ల వద్దకు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 8.9 శాతం ఎగసింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 128.64 డాలర్లకు చేరింది. అదేసమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 7.56 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 124.30 డాలర్లకు ఎగసింది. అయితే దేశీ మార్కెట్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈరోజు(సోమవారం) కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Petrol Diesel ధరల కంటే భారీ షాకిచ్చే ఘటన: పెట్రోల్ బంకులో డీజిల్ అంటూ నీళ్లు అమ్మేస్తున్నారు!


ఎన్నికలు ముగిసిన దరిమిలా దేశంలోని చ‌మురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌స్తుతం దేశానికి అవ‌స‌ర‌మైన క్రూడాయిల్‌లో 85 శాతం దిగుమ‌తుల ద్వారానే స‌మ‌కూరుతున్న‌ది. కాబ‌ట్టి క్రూడాయిల్ ధ‌ర పెంపు భార‌త ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఈ చమురు ధ‌ర‌ల పెంపు ప‌రోక్షంగా ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రింత‌ పెరుగ‌డానికి కూడా కార‌ణ‌మ‌వుతుంది. ఉక్రెయిన్-రష్యా యుద్దం వల్ల ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగాయి. ఎండల కారణంగా మాంసం ధరలు కొండెక్కాయి. ఇవాళ్టి నుంచి పెట్రో వాత కూడా మొదలుకానుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Diesel price, Fuel prices, Petrol Price, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు