కేరళ(Kerala)లో ఓ అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్‌లో మాత్రమే సేవలు అందిస్తున్న రోబోటిక్ యంత్రాలు ఇప్పడు దేవాలయాల్లో కూడా పూజలు, పుణ్య కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాయి. ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోకండి. కేరళలోని త్రిచూర్ (Trichur)జిల్లాలోని ఇరింజడ్‌పిల్లిలో శ్రీకృష్ణదేవాలయం ఉంది. అక్కడ ఏటా ఉత్సవాలు నిర్వహించి ఊరేగింపు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇక్కడి ఊరేగింపులో రామన్ రోబోటిక్ ఏనుగు (Raman is a robotic elephant)పాల్గొంటోంది. అసలు రోబోటిక్ ఏనుగు ఏంటీ ..దాని ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు.
ఊరేగింపులో కృత్రిమ ఏనుగు..
కేరళలోని త్రిసూర్ జిల్లాలోని శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణభగవానుడికి ఏటా ఉత్సవాలు నిర్వహించి ఊరేగింపు నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ అధికారులు. అయితే ఈమధ్య కాలంలో ఏనుగులు జనంపై దాడి చేయడం , వాటి ఉక్కు పాదాలతో జనాన్ని తొక్కివేయడం తరచూగా జరుగుతన్నాయి. అందుకే ఇక్కడ ఆలయ ఆచార వ్యవహారాలను నిర్వహించేందుకు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా(పెటా) ఓ రోబో ఏనుగును రూపొందించింది.ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టని ..అచ్చు ఏనుగు రూపంలో ఉండే రోబోట్ ఏనుగుని బహుమతిగా అందజేశారు.
రొబోటిక్ ఏనుగు ప్రత్యేకతలు..
ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి సమర్పించడం ఇక్కడ సంప్రదాయ ఆచారం. అందులో భాగంగానే ఆదివారం నాడు ఆలయంలో కలగాభిషేకం నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ రోబోటిక్ ఏనుగుకు 'ఇరింజడ్‌పిల్లి రామన్ అనే పేరు పెట్టారు. రోబోటిక్ ఏనుగు 800 కిలోల బరువు ఉండి.. 11 అడుగుల పొడవు ఉంది. ఇది బయట రబ్బరు పూతతో ఇనుప చట్రంతో తయారు చేయబడింది. దీని కదలికల కోసం 5 మోటార్లు ఉపయోగించబడతాయి. దాని ట్రంక్ ఒక మహౌట్ ద్వారా నడపబడుతుంది. సినీ ఆర్టిస్ట్ పార్వతి తిరువోత్ సహకారంతో పెటా వాళ్లు ఐదు లక్షల రూపాయలతో దీన్ని తయారు చేయించి ఆలయానికి విరాళంగా అందజేశారు.
ఎవరికి ఎలాంటి హానీ కలగకుండా..
11అఢుగుల ఎత్తున్న ఈ రామన్ నలుగుర్ని మోసుకొని వెళ్లగలదు. ఊరేగింపులకు దీన్ని ఉపయోగించడం వల్ల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని పెటా వాళ్లు ఈవిధంగా ఆలోచించారు. దేవాలయాలలో పూజలు చేయడానికి ఏనుగులను మాత్రమే ఉపయోగించవచ్చని తాంత్రిక వేదాలు పేర్కొనలేదు. ఇది ఆచారంలో ఒక భాగమంటున్నారు. కొన్ని చోట్ల మనుషులు ఏనుగుల పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడం వల్లే ఈ రోబోటిక్ ఏనుగును ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Robotics, VIRAL NEWS