• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PET DOG SAVES HER OWNERS LIFE IN MEDICAL EMERGENCY HERE IS INTERESTING VIRAL NEWS SK GH

చావుబతుకుల మధ్య యజమాని.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క.. ఎలాగో తెలుసా?

చావుబతుకుల మధ్య యజమాని.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క.. ఎలాగో తెలుసా?

యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క

అమెరికాలోని కన్సాస్ నగరంలో ఉన్న ఓ పెంపుడు కుక్క యజమానికి వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఆ కుక్క వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి యజమాని ప్రాణాలను కాపాడింది.

  • Share this:
జంతువులు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. ప్రాచీన కాలం నుంచి మనిషి మొదటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది జంతువులే. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కూడా కుక్కే కావడం విశేషం. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. విశ్వాసం చూపడంలో ఇవి ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమానికి ప్రాణాలను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కన్సాస్ నగరంలో ఉన్న ఓ పెంపుడు కుక్క యజమానికి వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఆ కుక్క వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి యజమాని ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని కన్సాస్ సిటీ పోలీసు డిపార్ట్మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

ఆదివారం రాత్రి N. టెన్త్ అవెన్యూలో ఉన్న ఐకాన్(ఇంపాక్టింగ్ క్రైమ్ ఇన్ అవర్ నైబర్ హుడ్) అధికారులకు, లారెల్ అవెన్యూలోని కన్సాస్ ఫైర్ డిపార్ట్‌మెంట్- కేసీకేఎఫ్డీ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు వారికి ఓ కాల్ వచ్చింది. ఓ వ్యక్తి తన కుక్కతో పాటు వాకింగ్‌కు వచ్చాడు. ఇంతలో అతడికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తింది. ఉన్నపళంగా పడిపోయాడు. పక్కనే ఉన్న శునకం యజమాని పరిస్థితిని చూసి వెంటనే అప్రమత్తమైంది. చుట్టూ పక్కల ఉన్నవారిని తన సంజ్ఞలతో పరిస్థితిని తెలియజేసింది. దీంతో వారు 911(అమెరికాలో ఎమర్జెన్సీ నెంబరు)కు సమాచారమిచ్చారు.

వెంటనే వైద్య సిబ్బందితో పాటు ఫైర్, పోలీసు అధికారులకు సంఘటన స్థలానికి చేరుకొని అతడికి తగిన వైద్య సహాయం అందించారు. యజమాని ప్రాణాలను కాపాడటంలో చురుకుగా స్పందించిన శునకాన్ని అధికారులు పొగుడుతున్నారు. ఆ శునకం చిత్రంతో పాటు ఈ కథనాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ కుక్కను అందరూ ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా యజమాని ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నారు. శునకాలు అద్భుతమైనవని, విశ్వాసం చూపడంలో ముందుంటాయని ఒకరు స్పందించారు. ఈ స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉందని, ఇలాంటి మంచి స్టోరీలు ఇంకా పోస్ట్ చేయాలని మరోకరు స్పందించారు. కొంతమంది తమ పెంపుడు కుక్క ఎంతో విశ్వాసంగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితి వస్తే తమ శునకం కూడా ఇలాగే స్పందిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతో హార్ట్ టచింగ్ స్టోరీ అని ఇంకొకరు స్పందించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, కుక్కలు ఎంతో విశ్వాసపాత్రులుగా ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు