Home /News /trending /

PET DOG INTERRUPTS MARRIAGE PROPOSAL WITH BATHROOM BREAK VIDEO GOES VIRAL SU GH

Viral: మ్యారేజ్ ప్రపోజల్‌కు బ్రేక్ వేసిన పెంపుడు కుక్క.. అది చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు

(Image- Youtube/ViralHog)

(Image- Youtube/ViralHog)

ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్న వ్యక్తికి అడ్డుపడింది ఒక కుక్క. దాని ఎంట్రీతో ఆ రొమాంటిక్ సీన్ కాస్త కామెడీ సీన్‌గా మారిపోయింది. ఆనందభాష్పాలకు కారణం కావాల్సిన ఈ సంఘటన నవ్వులు పూయించింది.

రొమాంటిక్ సినిమాల్లో లాగా ఎవరైనా ఓ యువకుడు తన మోకాళ్లపై కూర్చొని మ్యారేజ్ ప్రపోజల్ (Marriage proposal) చేస్తే.. ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇలాంటి మ్యారేజ్ ప్రపోజల్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిని కలిగిస్తాయి. ఈ తరహా మ్యారేజ్ ప్రపోజల్స్  చూపరులను కూడా కట్టిపడేస్తాయి. అయితే తన ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్న వ్యక్తికి అడ్డుపడింది ఒక కుక్క (Pet Dog). దాని ఎంట్రీతో ఆ రొమాంటిక్ సీన్ కాస్త కామెడీ సీన్‌గా మారిపోయింది. ఆనందభాష్పాలకు కారణం కావాల్సిన ఈ సంఘటన నవ్వులు పూయించింది.

వైరల్ అయిన వీడియో (Viral Video) ప్రకారం.. ఒక యువకుడు తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తుంటాడు. మొదటగా అతడు మాట్లాడుతూ.. "బంధుమిత్రులు అందరూ ఒకే ప్లేస్‌లో ఒకేసారి కలుసుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. నేను ఈ క్షణాలను మరింత మధురంగా మార్చాలి అనుకుంటున్నాను” అని సినిమా లెవెల్ లో డైలాగ్స్ చెప్పాడు. అనంతరం పక్కకు తిరిగి వెడ్డింగ్ రింగ్ బాక్స్ తీసుకున్నాడు. అతడు ప్రియురాలి ముందు మోకాళ్లపై కూర్చుంటున్న సమయంలోనే అటువైపు నుంచి టక్కర్ అనే పెంపుడు కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది.

Lucky Couple: పెళ్లి జరిగాక హనీమూన్ పక్కన పెట్టిన దంపతులు.. వాళ్లు చేసిన పని కోట్ల వర్షం కురిపించింది.. నాలుగు రోజులకే..

అందరూ ఆ యువకుడు ఎలా మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతున్నాడో ఆసక్తిగా చూస్తున్నారు. ప్రియురాలు కూడా సర్ప్రైజ్ అయ్యి అలానే చూస్తూ నిలుచుండి పోయింది. అప్పుడే టక్కర్ కుక్క మలవిసర్జన చేసింది. రొమాంటిక్ సీన్‌కి రెండు అడుగుల దూరంలోనే టక్కర్ టాయిలెట్ కి వెళ్లడంతో అక్కడి వారంతా పగలబడి నవ్వేశారు. ఎక్కడా స్థలం దొరకనట్టు ఈ ఆస్ట్రేలియన్ షెపర్డ్ (Australian Shepherd) కుక్క రొమాంటిక్ కపుల్ సమీపంలోనే బాత్రూమ్ బ్రేక్ తీసుకుంది.

Sajjanar: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ.. వైరల్‌గా మారిన సజ్జనార్ ట్వీట్.. పోస్ట్ మాములుగా లేదుగా..

కుక్క చేసిన పనికి అక్కడివారంతా బిగ్గరగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియోని వైరల్‌హాగ్ యూట్యూబ్ వేదికగా షేర్ చేసింది. 36 సెకండ్ నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సంఘటన అక్టోబర్ 2న ఫోర్ట్ మక్ ముర్రే, అల్బెర్టా, కెనడాలో జరిగింది.

Shocking: నాపై 28 మంది అత్యాచారం జరిపారు.. మా నాన్నే ముందుగా.. బాలిక ఆవేదన.. ఎఫ్‌ఐఆ‌ర్‌లో రాజకీయ నాయకుల పేర్లు..

అయితే ఆ జంట మాత్రం కుక్క చేసిన పనిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ప్రియురాలు మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి తన ప్రియుడిని గట్టిగా కౌగలించుకుంది. దీంతో వారి బంధుమిత్రులు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ ఫన్నీ క్లిప్‌ను వైరల్‌హాగ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది. ఆ వీడియో క్యాప్షన్ ప్రకారం, ఈ సంఘటన అక్టోబర్ 2 న కెనడాలోని అల్బెర్టాలోని ఫోర్ట్ మెక్‌మర్రేలో (McMurray, Alberta, Canada) జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటికే దీనికి 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. "నా కాబోయే భర్త నాకు ప్రపోజ్ చేస్తున్న వీడియో ఇది. నా టక్కర్ కుక్క మధ్యలో బాత్రూమ్ బ్రేక్ (Bathroom Break) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మేము తరువాత వీడియోలో గమనించాం,” అని వీడియోతో పాటు క్యాప్షన్ జోడించారు. అనుకోని కారణాల వల్ల ఆ క్షణం ఊహించిన దాని కంటే కొద్దిగా విచిత్రంగా మారింది కానీ ఆ జంట జీవితంలో ఈ క్షణం మరపురానిదిగా గుర్తుండి పోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు చాలా హాస్యాస్పదంగా కామెంట్లు చేస్తున్నారు. మీరు కాదు మీ కుక్కే ఈ క్షణాన్ని మరపురానిదిగా చేసింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బహుశా మీ పెళ్లి ప్రపోజల్ సమయానికి మీ కుక్క మీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుందేమో అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Pet dog, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు