Pet dog: ప్రాణాలు పోతున్నా.. ఏనుగును ఎదురించి యజమాని ఫ్యామిలీని కాపాడిన కుక్క

యజమాని కుటుంబాన్ని కాపాడిన టామీ ఇదే

Kerala dog fights with elephant: యజమాని కుటుంబంపై దాడి చేసేందుకు వస్తున్న ఏనుగుతో ఓ పెంపుడు కుక్క పోరాడింది. తాని చేతితో గాయపడి ప్రాణాలు పోతున్నా.. ఏనుగును ఎదురించి యజమాని కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడింది.

  • Share this:
పెంపుడు కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అందుకే ఇంటికి కాపలా ఉండడం కోసం కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. దొంగలు లేదా తెలియని వాళ్లు ఎవరు వచ్చినా అరిచి అది అందరినీ అప్రమత్తం చేస్తుందని మన నమ్మకం. కొందరైతే సొంత కుటుంబ సభ్యుడిలా కుక్కలను పెంచుకుంటారు. అయితే కొన్ని కుక్కలు తమ యజమాని కుటుంబంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తాయి. తాజాగా ఓ కుక్క తన యజమాని కుటుంబాన్ని కాపాడే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఇడుక్కి జిల్లా కంతలూరుకి చెందిన సోమన్ కుటుంబం పెంచుకున్న కుక్క కుటుంబాన్ని మదమెక్కిన ఏనుగు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తూ తన ప్రాణాలను వదిలింది. తన ప్రాణాలు పోతున్నా సరే.. ఏనుగును ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన ఆ శునకం వీర మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

అడవి నుంచి దారి తప్పి వచ్చిన ఓ ఏనుగు పంట పొలాలను నాశనం చేస్తూ సోమన్ ఇంటి దగ్గర ఉన్న వైర్డ్ ఫెన్సింగ్ లో చిక్కుకుంది. ఆ ఫెన్సింగ్​ని తన తొండంతో నాశనం చేసిన ఏనుగు సోమన్ ఇంటి వైపు పరిగెత్తింది. ఇంట్లో ఉన్నసోమన్, అతడి భార్య లిథియా, వారి సోదరి వలసమ్మ, పిల్లలు అభిలాష్, అమృతల వైపు అది పరుగులు పెట్టింది. లోపలికి పరిగెత్తే సమయంలోఇంటి బయట ఉన్న పిల్లర్ ముందు చిక్కుకుంది. ఈ లోపే ఆ ఇంట్లో టామీ అనే కుక్క తన చైన్ విడిపించుకొని వచ్చి మరీ ఏనుగు కాలును కరిచింది. అప్పటికే మదమెక్కి ఉన్న ఆ ఏనుగు మరింత కోపంతో రెచ్చిపోయింది. ఆ కుక్క వైపు వెళ్లడం ప్రారంభించింది. టామీ కూడా అరుస్తూ దానిపైకి దూకేందుకు ప్రయత్నించింది.

అమ్మాయిలూ అలర్ట్.. ప్రేమలో పడుతున్నారా? కేరళలో ఏమవుతోందంటే!

అయితే ఏనుగు తన బలమైన దంతాలతో టామీ కడుపులో పొడిచి దాన్ని ఎత్తేసింది. తన కడుపులోకి ఏనుగు దంతం దిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా టామీ ఏనుగు కళ్లలో తన కాళ్లతో గుచ్చుతూ తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. కళ్లలో గుచ్చడంతో నొప్పి వల్ల ఆ ఏనుగు టామీని అక్కడికక్కడే వదిలేసి తిరిగి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన టామీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చికిత్స తీసుకుంటూ అది బుధవారం మధ్యాహ్నం మరణించింది.

Heather: కర్వీ ఫిగర్‌తో కోట్లు సంపాదిస్తోంది.. కానీ ఒక్కటే సమస్య!

టామీ మరణ వార్తతో కేవలం సోమన్ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. స్థానికులు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. యజమాని కుటుంబ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తూ... తన ప్రాణాలు వదిలిన టామీ లాంటి పెంపుడు జంతువులు చాలా అరుదు అని చెబుతున్నారు. టామీ స్టోరీ విన్న నెటిజన్లు దాని విశ్వాసానికి హ్యట్సాప్ చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: