Viral Video: పెరట్లో పాము.. ఇంట్లోకి వెళ్లకుండా ఎదురొడ్డి నిలబడిన పిల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పామును నిలువరించిన పిల్లి

పెరట్లో నుంచి ఇంటి పరిసరాల్లోకి ఓ పాము వచ్చింది. పిల్లి వెంటనే స్పందించి పెరట్లోకి పరుగులు తీసింది. సంపద్ సైతం దాన్ని అనుసరించాడు. నాలుగు అడుగుల పొడవున్న నాగుపాముకు పిల్లి ఎదురుగా నిల్చొని.. దాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంది.

  • Share this:
కుక్కలు, పిల్లులు మానవులకు అత్యంత సన్నిహతంగా ఉండే జంతువులు. విశ్వాసంతో ఉండటమే కాకుండా చాలా సమయాల్లో సహాయంగానూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనుషుల కోసం ప్రాణాలకు కూడా తెగిస్తాయి. తాజాగా ఓ పిల్లి తన యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు భయంకరమైన పాముతో పోరాడింది. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము(Cobra)ను ఇంట్లోకి రానీయకుండా రక్షణగా నిలబడింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆ పామును నిలువరించింది. ఈ ఘటన ఒడిశా రాజధాని భూవనేశ్వర్ నగరంలోని భీమాటాంగ్రీ ప్రాంతంలో జరిగింది.

సంపద్ కుమార్ పరిదా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి భీమాటాంగ్రీ ప్రాంతంలో నివాసముంటున్నాడు. వీరికి చీను అనే పిల్లి ఉంది. మంగళవారం పెరట్లో నుంచి ఇంటి పరిసరాల్లోకి ఓ పాము వచ్చింది. పిల్లి వెంటనే స్పందించి పెరట్లోకి పరుగులు తీసింది. సంపద్ సైతం దాన్ని అనుసరించాడు. నాలుగు అడుగుల పొడవున్న నాగుపాముకు పిల్లి ఎదురుగా నిల్చొని.. దాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో రెండింటి మధ్య పోరాటం జరిగింది. పామును అంగుళం కూడా కదపకుండా అక్కడే ఉండేలా చేసింది పిల్లి.





సంపద్ వెంటనే సహాయం కోసం స్నేక్ హెల్ప్ లైన్‌కు కాల్ చేశాడు. స్వచ్ఛంద కార్యకర్త అయిన అరుణ్ కుమార్ బలాల్ సంఘటనా స్థలానికి చేరుకుని, పిల్లిని దూరంగా తీసుకెళ్లాడు. అనంతరం పామును పట్టుకున్నాడు. అరుణ్ వచ్చేవరకు దాదాపు 30 నిమిషాల పాటు పిల్లి పామును నిలువరించింది. ఆ పామును నగరం వెలుపల జనావాసాలకు దూరంగా వదిలిపెట్టారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పిల్లి శరీరంపై పాము కాట్లు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు. అయితే దానిపై పాము ఎలాంటి దాడి చేయలేదు.

2019లో ఖుర్దా జిల్లాలో జాన్లా అనే గ్రామంలో పెంపుడు కుక్క తన యజమాని కుటుంబాన్ని విషపూరిత పాము నుంచి రక్షించింది. ఈ క్రమంలో తన ప్రాణాన్నే త్యాగం చేసింది. అదే ఏడాది భువనేశ్వర్‌లో బడగాడ ప్రాంతంలో.. ఓ పెంపుడు కుక్క కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడటానికి ఓ నాగుపాముతో పోరాడింది. పామును గుర్తించి ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది.
Published by:Shiva Kumar Addula
First published: