PERSON FIGHT WITH LEOPARD AT BENDEKERE IN KARNATAKA TO SAVE FAMILY SSR
Fight with Leopard: బైక్‌పై ఫ్యామిలీతో వెళ్తుంటే అడ్డగించిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే..
చిరుతపులిని హతమార్చిన రాజగోపాల్
‘మన్యం పులి’ సినిమా కథ గుర్తుందా. హీరో చిన్నతనంలో ఉండగా పులి తన తండ్రిని చంపుతుంది. ఆ ఘటనతో హీరో ఒక్కసారిగా చలించిపోతాడు. పదేళ్ల వయసు కూడా నిండని హీరో ఆ పులిని తన బుద్ధిబలంతో మట్టుపెడతాడు. అప్పటి నుంచి తన గ్రామంలోకి పులి ప్రవేశిస్తే...
‘మన్యం పులి’ సినిమా కథ గుర్తుందా. హీరో చిన్నతనంలో ఉండగా పులి తన తండ్రిని చంపుతుంది. ఆ ఘటనతో హీరో ఒక్కసారిగా చలించిపోతాడు. పదేళ్ల వయసు కూడా నిండని హీరో ఆ పులిని తన బుద్ధిబలంతో మట్టుపెడతాడు. అప్పటి నుంచి తన గ్రామంలోకి పులి ప్రవేశిస్తే దాన్ని వేటాడి ప్రజలను కాపాడుతుంటాడు. తాజాగా.. కర్ణాటకలో ఈ రీల్ కథను పోలిన ఘటన ఒకటి జరిగింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆ వ్యక్తి ఏకంగా చిరుతపులితోనే పోరాడాడు. ఆ పులి చేసిన గాయాలను సైతం తట్టుకుని ప్రాణాలకు తెగించి ఆ చిరుతను మట్టుబెట్టాడు. తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... భార్య, కుమార్తెతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాజ్‌గోపాల్ నాయక్‌పై చిరుతపులి ఒక్కసారిగా దూకింది. ఆకలితో కసి మీద ఉన్న ఆ పులి మీద పడటంతో బైక్ అదుపు తప్పి రాజ్‌గోపాల్, అతని భార్య, కుమార్తె కిందపడిపోయారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న చిరుత అదే అదనుగా ఆ కుటుంబంపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. చిరుత బారి నుంచి భార్య, కూతురుని కాపాడుకునేందుకు పులితో రాజ్‌గోపాల్ యుద్ధమే చేశాడు. మీద పడి దాడి చేస్తున్న ఆ చిరుతతో చావోరేవో అన్నట్టుగా పోరాడాడు. ఆ చిరుతను చేతికందిన కర్రతో చావబాదాడు. దీంతో.. మరింత కోపంతో రెచ్చిపోయిన ఆ చిరుత రాజగోపాల్‌పై పడి తలపై దాడి చేసింది.
తలకు తీవ్ర గాయమై రక్తం కారుతున్నా వెనుకడుగేస్తే తనతో పాటు తన భార్య, కూతురి ప్రాణాలు కూడా దక్కవని భావించిన అతను చిరుతతో తలపడ్డాడు. ఎట్టకేలకు రాజగోపాల్ కర్రతో కొట్టిన దెబ్బలతో తీవ్రంగా గాయపడిన చిరుత చనిపోయింది. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం రాజగోపాల్ పడిన తపనకు స్థానికులు ఫిదా అయ్యారు. ఇది ‘మన్యం పులి’ సినిమా కాదని, కానీ.. రాజగోపాల్ మాత్రం రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. చిరుత దాడిలో రాజగోపాల్‌తో పాటు తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిరుత బారి నుంచి భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్ నాయక్ వీరోచిత పోరాటం చేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తెతో సహా రాజ్‌గోపాల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.