వర్క్ ఫ్రం హోమ్ చాలా డేంజర్ అంటున్న సత్య నాదెళ్ల

వర్క్ ఫ్రం హోమ్ వల్ల మానసిక సమస్యలు: సత్య నాదెళ్ల

Work from Home : కరోనా ఎఫెక్ట్‌తో సాఫ్ట్‌వేర్ సహా పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉండబోతున్నందున చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ చేయిస్తున్నాయి.

  • Share this:
    కరోనా ఎఫెక్ట్‌తో సాఫ్ట్‌వేర్ సహా పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉండబోతున్నందున చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ చేయిస్తున్నాయి. అవసరం అయితే తప్ప ఆఫీస్‌కు రావొద్దని ముందుగానే సూచిస్తోంది. జీవన విధానం మారుతున్నందున వర్క్ ఫ్రం హోమ్‌ను పర్మినెంట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. ఇది చాలా డేంజర్ అని అంటున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. దాని వల్ల మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండి పని చేయడం వల్ల సామాజిక సంబంధాలు దెబ్బ తింటాయని అన్నారు. ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం వేరని, వీడియో కాన్ఫరెన్స్‌లు ఎప్పటికీ వాటి ముందు సరి తూగవని ఆయన చెప్పారు.

    ప్రత్యక్ష సంభాషణ అనేది ప్రత్యేక అనుబంధాన్ని పెంచుతుందని, స్ఫూర్తికి దోహదపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగుల మధ్య, సమాజంలో ఎడబాటుకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఒక తీవ్ర సమస్యను పరిష్కరించేందుకు మరో తీవ్ర సమస్యను సృష్టించినట్లు అవుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే తాము వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిని కొనసాగిస్తామని, కరోనా తీవ్రత తగ్గగానే పూర్వపు స్థితిలోనే కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: