ఆ అరటిపండు రేటు రూ.85 లక్షలు... ఎందుకో తెలుసా?

Banana Taped To Wall : మన మార్కెట్లలో డజను అరటిపండ్లు ఏ వందో, రెండు వందలో ఉంటాయి. అలాంటిది ఆ అరటి పండు ఏకంగా రూ.85 లక్షలు ఎందుకుంది? తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 9, 2019, 12:49 PM IST
ఆ అరటిపండు రేటు రూ.85 లక్షలు... ఎందుకో తెలుసా?
ఆ అరటిపండు రేటు రూ.85 లక్షలు... ఎందుకో తెలుసా? (credit - instagram)
  • Share this:
Banana Taped To Wall : పైన హెడ్డింగ్‌లో మీరు చదివింది నిజమే. ఆ అరటి పండు రేటు అక్షరాలా రూ.85 లక్షలే. డాలర్లలో 1.2లక్షల డాలర్లు. అదేమీ అరుదైనదీ, ప్రపంచంలోనే ఇంకెక్కడా లేనిది కాదు. మనం రోజువారీ తినే మామూలు అరటి పండే. కాకపోతే... అమెరికా... మియామీ బీచ్ బేసల్ షోలో దాన్ని గోడకు డక్ట్ టేపుతో అతికించి రేటు రూ.85 లక్షలు ఫిక్స్ చేశారు. చాలా మంది ఆ షోలో మిగతా వస్తువుల్ని చూసినట్లే... అరటిపండునూ చూస్తూ ముందుకెళ్తున్నారు. డేవిడ్ డటునా అనే పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ మాత్రం ఆ అరటి పండు టేపును తొలగించి... దాన్ని తొక్క వలిచి తినేశాడు. టేస్ట్ బాగుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత తెలిసింది. తాను తిన్నది రూ.85 లక్షల ఖరీదైన అరటి పండు అని. నిజం తెలిశాక షాక్ అయ్యాడు. ఇప్పుడెలా... నా దగ్గర అంత డబ్బు లేదు అంటూ నిర్వాహకులను వేడుకున్నాడు. అప్పటికే అతన్ని చూస్తే... సందర్శకులు నవ్వుతున్నారు. ఇదంతా గమనించిన నిర్వాహకులు... అతన్ని ఏమీ అనకుండా... అక్కడి నుంచీ వెళ్లిపోమని చెప్పారు. ఆ తర్వాత అక్కడ అలాంటిదే మరో అరటి పండును పెట్టారు. 

View this post on Instagram
 

“Hungry Artist” Art performance by me ? I love Maurizio Cattelan artwork and I really love this installation It’s very delicious ? #artbasel #artbaselmiamibeach #daviddatuna #Eatingabanana #Mauriziocattelan #Hungryartist


A post shared by David Datuna (@david_datuna) on

ఇంతకీ గోడకు అలా అరటిపండును ఎందుకు అతికించారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇటలీకి చెందిన ఆర్టిస్ మారీజియా కాట్టెలాన్ క్రియేటివిటీ అది. అరటి పండుకు కమెడియన్ అనే టైటిల్ పెట్టిన ఆయన... దాన్ని ఫ్రాన్స్‌కి చెందిన ఓ కలెక్టర్ (అరుదైన వస్తువుల్ని సేకరించే వ్యక్తి)కి రూ.85 లక్షలకు అమ్మాడు. రెండోసారి అతికించిన అరటిపండును ఎవరూ టచ్ చెయ్యలేదు.

 

Pics : క్యూట్ పోజులతో కవ్విస్తున్న రోష్నీ వాలియా...
ఇవి కూడా చదవండి :

 

కర్ణాటకలో మళ్లీ బీజేపీ హవా... ఉప ఎన్నికల్లో 12 స్థానాలు

ఉల్లిపాయల పోరాటంలో ప్రాణాలు విడిచిన వృద్ధుడు

డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో

కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు