40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...

Wolf of Siberia : సాధారణంగా జంతువులు చనిపోతే... కళేబరాలుగా మారిపోతాయి. కానీ సైబీరియాలో చనిపోయిన ఆ తోడేలు... ఇప్పటికీ తాజాగానే ఉంది. కారణం మంచే.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 8:54 AM IST
40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...
40 వేల ఏళ్ల నాటి తోడేలు తల (Image : Twitter / Rita Panahi)
Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 8:54 AM IST
ఆఫ్రికాలో ఒకప్పుడు భారీ ఏనుగులు (Mammoths) ఉండేవి. ఇప్పుడవి లేవు. ఇప్పుడున్న ఏనుగుల పరిమాణం... అప్పటివాటితో పోల్చితే చాలా తక్కువ. ఐతే, మమ్మోత్స్ బతికిన కాలంలోనే... సైబీరియాలో... భారీ తోడేళ్లు జీవించాయి. వాటిలో ఒక తోడేలు తలను రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌కి చెందిన పరిశోధకులు గుర్తించారు. అది ఐస్ ఏజ్ (మంచు యుగం) నాటిదనీ, 40 వేల ఏళ్ల కిందట చనిపోయిందనీ తేల్చారు. యాకుషియాలో కనిపించిన ఆ తలను చూస్తే... ఆ తోడేలు ఇప్పుడే చనిపోయిందేమో అన్నట్లుగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాతి తోడేళ్లు... మమ్మోత్స్ అంతరించిన సమయంలోనే, అంతరించిపోయాయని పరిశోధకుల బృందంలో ఒకరైన వాలెరీ ప్లాట్నికోవ్ తెలిపారు.

Head, Ice Age, Siberia, Wolf, russia, ice preserved, ice age, animal, viral news, వైరల్ న్యూస్, తోడేలు, సైబీరియా, రష్యా, మంచు యుగం, మమ్మోత్, ఏనుగు,
40 వేల ఏళ్ల నాటి తోడేలు తల (Image : Valery Plotnikov/Mammoth Fauna Study Department at the Academy of Sciences of Yakutia via AP)


ప్రస్తుతం ఉన్న తోడేళ్ల కంటే... ఆ తోడేలు... 25 శాతం పెద్దగా ఉండేదని, తల పరిమాణాన్ని బట్టీ తేల్చారు. అది మగ తోడేలా, ఆడదా అన్నది మాత్రం తెలియదన్నారు. సైబీరియాలో ఇదివరకు ఎన్నో తోడేళ్ల కళేబరాలు దొరికాయి. వాటికి కణజాలం గానీ, జూలు గానీ లేదు. ఈ తోడేలు తలకి మాత్రం చెవులు, నాలిక, మెదడు అన్నీ తాజాగానే ఉన్నాయని తెలిపారు.


Loading...
సైబీరియాలో ఎప్పుడూ మైనస్ ఉష్ణోగ్రతలే ఉంటాయి. సాధారణంగా అక్కడ మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్లే ఆ తోడేలు తల ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉందంటున్నారు సైంటిస్టులు.

 

ఇవి కూడా చదవండి :

డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం

టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...

ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...

నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...