PEOPLE PICK UP FUEL FROM OVERTURNED DIESEL TANKER IN BIHAR SNR
Diesel Free:కక్కూర్తికి పరాకాష్టే ఈ వీడియో..ఫ్రీగా వస్తుందని ఏం తీసుకెళ్తున్నారో చూడండి
Photo Credit:Youtube
Diesel Free:ఫ్రీగా వస్తే ఫినాయిలే వదలరు జనం. అలాంటిది లీటర్ వంద రూపాయలు దాటిన డీజిల్‌ని ఎందుకు వదిలిపెడతారు. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందని తెలిసి కూడా జనం ప్రాణాల్ని లెక్క చేయకుండా పోలీసులకు భయపడకుండా బాటిల్స్, బకెట్లలోకి డీజిల్ ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎక్కడైనా ఫ్రీగా వస్తుందంటే దేనిని వదలరు జనం. అలాంటిది ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel)ఉచితంగా వస్తుందంటే ఎందుకు వదిలిపెడతారు. బిహార్‌లో అదే జరిగింది. బెగుసరాయ్‌లో ఓ డీజిల్ ట్యాంకర్(Diesel tanker)ప్రమాదవశాత్తు బోల్తా పడింది. డీజిల్ ట్యాంకర్ రోడ్డు పక్కకు పల్టీ కొట్టి బోర్ల పడటంతో లోపలున్న ఇంధన పూర్తిగా నేలపాలైంది. ట్యాంకర్‌లోంచి ఇంధనం వృధాగా పోతుండటం గమనించిన చుట్టు పక్కల జనం బకెట్లు(Buckets), బాటిల్స్(Bottles),పట్టుకొని దాని చుట్టూ చేరిపోయారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిందని పోలీసుల(Police)కు సమాచారం ఇచ్చి..వాళ్లు వచ్చేలోపే సగం ట్యాంకర్ డీజిల్‌ని ఎత్తుకెళ్లిపోయారు చుట్టుపక్కల నివసిస్తున్నప్రజలు. పోలీసు వచ్చి ఆయిల్ ట్యాంకర్ దగ్గర కాపాల ఉన్నప్పటికి పోలీసుల కళ్లుగప్పి మరికొందరు డీజిల్‌ని ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో(Video)నే సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లో మానవత్వం కరువైపోవడమే కాకుండా ఉచితంగా వస్తుందంటే మనుషులు ఎంత కక్కూర్తితో వ్యవహరిస్తారో అద్దం పడుతోంది ఈ దృశ్యం. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బెగుసరాయ్Begusaraiలో ఈఘటన జరిగింది. బల్లియా (Ballia)పోలీస్ స్టేషన్(Police Station)పరిధిలోని మాము భంజ ధాలా(Mamu bhanja dhala)నేషనల్ హైవే(NH)31కి దగ్గరలో డీజిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాకపోతే ట్యాంకర్‌లోని ఇంధనం మొత్తం నేలపాలైంది. కొంజ జనం పాలైంది.
కక్కూర్తికి పరాకాష్ట..
ఓవైపు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అందులో ఉన్న డ్రైవర్‌కి ఏమైనా జరిగిందా లేక అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో పోలీసులు ముందస్తుగానే అక్కడికి చేరుకొని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నప్పటికి వాళ్లు మాత్రం పోలీసులు చెప్పేది వినిపించుకోకుండా బాటిల్స్, బకెట్లలో డీజిల్ నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఫ్రీగా వస్తుందని ఎగబడ్డారు..
పశ్చిమ బెంగాల్‌కి చెందిన WB 73D 0140 నంబర్ గల ట్యాంకర్ బెగుసరాయ్ నుండి ఖగారియా వైపు వెళ్తుంది. జాతీయ రహదారి 31పైన బల్లియా పోలీస్ స్టేషన్‌కి సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి బోర్లా పడింది. బోర్లా పడిన ట్యాంకర్లో ఉన్న డ్రైవర్‌కి ఏమైనా ప్రమాదం జరిగిందా అని ఆలోచించకుండా ఫ్రీగా పోతున్న డీజిల్ కోసం జనం పడుతున్న ఆరాటం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.