news18-telugu
Updated: November 8, 2020, 10:49 AM IST
Party in the USA: జో బిడెన్ గెలుపుతో అమెరికాలో వీకెండ్ సంబరాలు...(credit - twitter)
Party in the USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ బై చెప్పి... జో బిడెన్‌కి గ్రాండ్ వెల్ కం చెబుతూ... వీకెండ్లో సంబరాలు జరుపుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇదివరకు ట్రంప్‌కి మద్దతుగా నిలిచిన చాలా మంది ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తుండటం విశేషం. ఇందుకు ప్రధాన కారణం... కరోనా వైరస్, నిరుద్యోగమే. మాటలతో కాలక్షేపం చేసిన ట్రంప్ చేతల్లో చేసి చూపించలేకపోవడంతో... "ట్రంప్ యు ఆర్ ఫైర్డ్" (ట్రంప్ నీ ఉద్యోగం ఊడింది - #Trumpyouarefired) అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... ఆయన్ని ఉతికారేస్తున్నారు అమెరికన్లు. వీకెండ్లో జనరల్‌గానే వాళ్లు పార్టీలు చేసుకుంటారు. ఈసారి మరింత ఉత్సాహంతో చేసుకుంటున్నారు. పార్టీ ఇన్ ది యూఎస్ఏ (Party in the USA) అంటూ... నటి, సింగర్ మిలీ సైరస్... తన ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టి... అందరికీ విషెస్ చెప్పింది.
ఇదివరకు రిపబ్లికన్లవైపు ఉండే... రాష్ట్రాలు కూడా చాలా వరకూ ఈసారి బిడెన్ వైపుకి వచ్చేశాయి. దాంతో... బిడెన్ గెలువు ఈజీ అయిపోయింది. దాంతో... ట్రంప్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, రీ-కౌంటింగ్ అంటూ... ఏవేవో కారణాలు వెతికిన ట్రంప్... చివరకు ఓడిపోక తప్పలేదు. జనరల్‌గా అమెరికాలో ఎవరైనా 2సార్లు అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ట్రంప్ చరిత్ర ఒక్కసారితోనే ముగిసిపోయింది. ఇంత కంటే అవమానం ఏముంటుంది. ట్రంప్‌ని ఎలాగైనా ఓడించాలనుకున్న ఓటర్లు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి డాన్సులు వేస్తూ... సంబరాలు చేసుకుంటున్నారు. 2020లో జరిగిన మంచి విషయాల్లో ఇది ఒకటి అంటున్నారు.
భారత చెఫ్ వికాస్ ఖన్నా... ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో ఉంటున్నారు. ఆయన కూడా న్యూయార్క్ వీధుల్లో ప్రజలు డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. "ఇప్పుడు న్యూయార్క్ సిటీ ఇలా ఉంది. ఇది సరికొత్త శకానికి నాంది" అని ఆయన క్యాప్షన్ పెట్టారు.
ఎలక్టొరల్ కాలేజీలో... 270 మేజిక్ ఫిగర్ ఉండగా... ట్రంప్ 213 ఓట్లకే పరిమితం కాగా... జోబిడెన్ 290 ఓట్లు సాధించి... అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే తొలిసారిగా ఓ మహిళ, అది కూడా ఆఫ్రో-ఆసియా మహిళ కమలా హారిస్... అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఒబామా హయాంలో అమెరికాలో అభివృద్ధి, శాంతిని చూసిన ప్రజలు... మరోసారి అదే డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అధ్యక్షుడు అవ్వడంతో... ప్రజలు భవిష్యత్తుపై పాజిటివ్‌గా ఉన్నారు. జనవరిలో జో బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపడతారు.
"ఈ దేశాన్ని ముందుకు నడిపించేందుకు... మీరు నన్ను ఎంచుకొని, గెలిపించాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మన ముందు చేయాల్సిన పని చాలా ఉంది. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను అందరికీ అధ్యక్షుడిగా ఉంటాను. నాకు ఓటు వేసినా, వేయకపోయినా. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను" అని బిడెన్ తన గెలుపు తర్వాత ట్వీట్ చేశారు.
Published by:
Krishna Kumar N
First published:
November 8, 2020, 10:49 AM IST