పొలాల్లో డీజే పాటలు.. మిడతలను తరిమేందుకు రైతుల కష్టాలు

మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు ప్లేట్లు గరిటలు పట్టుకొని.. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మిడతలను తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మిడతల దండుపై క్రిమి సంహారాలను చల్లుతున్నారు.

news18-telugu
Updated: May 27, 2020, 5:49 PM IST
పొలాల్లో డీజే పాటలు.. మిడతలను తరిమేందుకు రైతుల కష్టాలు
పంట పొలాల్లో డీజే పాటలు
  • Share this:
కరోనా కష్టాల్లో ఉన్న భారత్‌కు మరో ముప్పు ముంచుకొచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాల్లో మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది. పంటల పొలాలపై పడి సర్వ నాశనం చేస్తున్నాయి. వేలకు వేల ఎకరాల పంటను స్వాహా చేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్‌ మీదుగా భారత్‌ మీద దండెత్తిన ఈ మిడతల దండు.. ఇప్పుడు మహారాష్ట్రలోకీ ప్రవేశించింది. అక్కడ నుంచి తెలంగాణలోకి కూడా వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే ఈ మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు ప్లేట్లు గరిటలు పట్టుకొని.. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మిడతలను తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మిడతల దండుపై క్రిమి సంహారాలను చల్లుతున్నారు.

ఐతే ఓ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించి.. తమ పొలంలో డీజే మోత మోగించాడు. ఓ వాహనానికి లౌడ్ స్పీకర్‌లను బిగించి.. బిగ్గరగా పాటలు పెట్టాడు. లౌడ్ స్పీకర్ల మోతకు మిడతలు పరుగులు పెడుతున్నాయి. ఆ వీడియోను యూపీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. డీజే పాటలు తీన్మార్ డాన్స్‌లు చేసేందుకే కాదు.. మిడతలను తరిమేందుకు కూడా ఉపయోగపడతాయని సరదాగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఐడియా అదిరింది గురూ.. దేశీ జుగాడ్‌కు సెల్యూట్ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.