చైనా.. ప్రపంచంలో రారాజుగా ఉండాలని పావులు కదుపుతోంది. తన గుత్తాధిపత్యం ప్రదర్శించాలనుకుంటోంది. కానీ, అక్కడి జనమేమో రోడ్లపై జుట్లు ఊడిపోయేలా కొట్టుకుంటున్నారు. ఏంటీ ప్రపంచాన్ని జయించడానికే? అంటారా అబ్బే లేదండి.. ఏదో చిన్న విషయానికే కిందా మీద పడి.. తన్నుకుంటూ.. బట్టలు చించుకుంటూ కొట్టేసుకున్నారు. వీళ్ల కొట్టుకోవడం ఎలా ఉందంటే అక్కడి జంతువులు కూడా ఛీ.. దీనమ్మ.. జూలో కూడా ప్రశాంతత లేకుండా పోయిందే అనుకునేలా.. మరి కోతులకు మాత్రం భలే నచ్చిందటండీ ఈ కొట్టుకోవడాలు.. ఇంకేం జాలో అర్ధరాత్రి వీరంగమే సృష్టించాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటారా? రాజధాని బీజింగ్‌లో. పర్యాటకులు కొట్టుకున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయిపోతోంది. అయితే ఆ గొడవ జరిగిన తర్వాత జూలో జంతువులు నానా హంగామా చేశాయంటా. దీనిపై అక్కడి జూ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
చైనా రాజధాని బీజింగ్‌లోని వైల్డ్ లైఫ్ పార్కలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సందర్శకులు పెద్ద సంఖ్యలో జంతువులను చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇద్దరు సందర్శకుల మధ్య గొడవ జరిగి.. రెండు కుటుంబాలు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. రెండు గ్రూపులుగా విడిపోయిన మహిళలు ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఇదే సమయంలో చిన్నారితో ఉన్న ఓ మహిళను ఓ వ్యక్తి కాలితో గట్టిగా తన్నడంతో ఆమె చేతిలో నుంచి చిన్నారి జారి కింద పడిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి జూలోని భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. అయితే గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఈ గొడవ అక్కడే ఉన్న పర్యాటకులే కాదు.. చివరికి జంతువులు కూడా నిలబడి చూస్తూ ఉండిపోయాయని జూ అధికార యంత్రాంగం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జంతువులపై ప్రభావం చూపిందని, మనుషులను అనుకరిస్తూ.. కోతులు కూడా రాత్రి ఒకదానిపై మరొకటి దాడికి దిగినట్టు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ గొడవపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి మనుషులు కొట్టుకోవడం చూసి జంతువులు నవ్వుకున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Animal Lovers, China, Cock fight