Home /News /trending /

PEOPLE CARRYING GHEE FROM AN OVERTURNED TANKER IN RAJASTHAN VIDEO IS GOING VIRAL SNR

Video viral : ఫ్రీగా వస్తే ఫినాయిలే వదలరు ..నెయ్యిని ఎందుకు విడిచిపెడతారు ..వైరల్ అవుతున్న వీడియో ఇదే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video viral: రాజస్థాన్‌లో ఫ్రీగా వస్తుందని ట్యాంకర్ నెయ్యిని ఎత్తుకెళ్లారు స్థానికులు. రోడ్డు ప్రమాదానికి గురైన ట్యాంకర్‌లో డ్రైవర్‌ చావు బతుకుల మధ్య ఉంటే వృధాగా పోతున్న నెయ్యిని ఎత్తుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. రెండు గంటల్లో ట్యాంకర్‌ నెయ్యిని కాళీ చేశారు. పోలీసులు వచ్చిన డ్రైవర్‌ ప్రాణాలు కాపాడారు.

ఇంకా చదవండి ...
ఫ్రీగా వస్తుందంటే జనం ఫినాయిల్నే వదలరు...అలాంటిది నెయ్యి(Ghee)ని ఎందుకు విడిచిపెడతారు. ఉచితంగా తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. రోడ్డుపైన నదిలా ప్రవహిస్తున్న నెయ్యిని ఎత్తుకెళ్లేందుకు బాటిల్స్(Bottles), డబ్బాలే కాదు క్యాన్స్‌(Cans) , టిన్‌(Tins)లు తీసుకొని పెద్ద సంఖ్యలో గూమికూడారు. ఉచితంగా వచ్చే వాటి కోసం జనం ఏ స్థాయిలో ఆశ చూపిస్తున్నారో తెలిపే వీడియో (Video)ఇప్పుడు వైరల్(Viral)అవుతోంది. రాజస్థాన్‌(Rajasthan)లో జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వార్త కంటే అక్కడి వీడియో(Video)నే నెటిజన్ల(Netizens)ను తెగ ఆకర్షిస్తోంది.

నెయ్యి కోసం ఎగబడ్డ జనం..
రాజస్థాన్‌లోని స్వరూపగంజ్ హైవేపై ఓ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్‌ నెయ్యిని లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్యాంకర్‌లోని వేల లీటర్ల నెయ్యి నేలపాలైంది. రోడ్డుపైన నెయ్యి ఓ కాలువ రూపంలో ప్రవహిస్తూ ఉండటంతో విషయం స్థానికులకు తెలిసింది. అంతే ఫ్రీగా రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని ఎత్తుకెళ్లేందుకు జనం డ్రమ్‌లు, బకెట్‌లు తీసుకొని ఎగబడ్డారు. దారుణమైన విషయం ఏమిటంటే ప్రమాదంలో ట్యాంకర్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ని కాపాడాలనే విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా నెయ్యిని వెంట తెచ్చుకున్న డబ్బాల్లో నింపుకునేందుకే ఆసక్తి చూపించారు.

ఫ్రీగా వస్తుందనే కక్కూర్తి..
నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిందనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సరుప్‌గంజ్ పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. లోపల చిక్కుకున్న డ్రైవర్‌ని బయటకు తీసి అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై పడిన ట్యాంకర్ నుంచి వేల లీటర్ల నెయ్యిని ఎత్తుకెళ్లేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చిన దాబా నిర్వాహకులు, హోటల్‌ యజమానులు క్యాన్లు, డ్రమ్ములు,డబ్బాలతో కనిపించడంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సుమారు గంటన్నరపాటు పోలీసులు విస్తృతంగా శ్రమించి ఫ్రీగా నెయ్యిని డబ్బాల్లో నింపుకెళ్తున్న వారిని అక్కడి నుంచి తరిమేశారు.

Husband Caught : పెళ్లానికి తెలియకుండా ప్రియురాలితో ఫారిన్ లో ఎంజాయ్..ఆ ఒక్క పనితో మెత్తం గుట్టు రట్టు



వైరల్ అవుతున్న వీడియో ..
ప్రమాదం జరిగిన మూడు గంటల వ్యవధిలోనే ఫుల్ ట్యాంకర్‌ నెయ్యి పూర్తిగా కాళీ చేశారు స్థానికులు. మరోవైపు ఫ్రీగా నెయ్యి ఎత్తుకెళ్లే వారితో పాటు నేషనల్‌ హైపేపై వెళ్లే ఇతర వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో రోడ్డుపై నిలబడి రూట్‌ డైవర్ట్ చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు పోలీసులు. గంటల వ్యవధిలోనే ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. క్రేన్‌ సహాయంతో నెయ్యి ట్యాంకర్‌ని రోడ్డు పక్కకు జరిపించారు. రోడ్డుపై వెళ్తున్న మరికొందరు వాహనదారులు ఫ్రీగా నెయ్యి ఎత్తుకెళ్తున్న వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు మాత్రం జనం కక్కూర్తి చూసి నవ్వుకుంటున్నారు. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

MLA Raja Singh: అమర్ నాథ్ వరదలు.. తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌.. అసలేం జరిగిందంటే..


Published by:Siva Nanduri
First published:

Tags: Rajasthan, Viral Video

తదుపరి వార్తలు