Video : ఆ మెట్టుపై దెయ్యం కూర్చుందా? ప్రయాణికులను అదే పడేస్తోందా?

NYC Subway : ఆ మెట్టుపై దెయ్యం ఉందనీ, అది అక్కడ నిద్రపోతూ... అక్కడే ఉంటూ... దానిపై కాలు వేసిన వాళ్లను పడేస్తోందనే ప్రచారం జరిగింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 12:09 PM IST
Video : ఆ మెట్టుపై దెయ్యం కూర్చుందా? ప్రయాణికులను అదే పడేస్తోందా?
ఆ మెట్టు ఎందుకు పడేస్తోంది? (Image : Youtube - The RedCat Partnership Ltd)
Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 12:09 PM IST
న్యూయార్క్‌‌లో సబ్ వే స్టేషన్లకు లెక్క లేదు. కానీ... 36వ స్ట్రీట్ స్టేషన్ మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకంటే... అన్ని స్టేషన్లలో లాగా... అక్కడ కూడా స్టేషన్‌కి మెట్లు ఉన్నాయి. వాటిని ఎక్కేటప్పుడు మాత్రం ప్రయాణికులు రెగ్యులర్‌గా పడిపోతున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రోజూ కనిపించేవే. ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్న తలెత్తింది. పరిశోధనలో తేలిందంటే... పడిపోయేవాళ్లలో 99 శాతం మంది... ఆ మెట్లలో మధ్యలో ఉన్న మెట్టును ఎక్కుతున్నప్పుడు మాత్రమే పడిపోతున్నారు. ఈ విషయం తెలియడంతో... ఆ మెట్టుపై దెయ్యం ఉందనీ, అది అక్కడ నిద్రపోతూ... అక్కడే ఉంటూ... దానిపై కాలు వేసిన వాళ్లను పడేస్తోందనే ప్రచారం జరిగింది. ఇలాంటివి నమ్మే రోజులా ఇవి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన పరిశోధకులు... ఎందుకు ఆ మెట్టుపై జనం పడిపోతున్నారో పరిశోధించారు.

పరిశోధనలో తేలిందేంటంటే... మిగతా మెట్ల కంటే... ఆ మధ్యలో మెట్టు (జనం పడిపోతున్నది)... ఒక ఇంచు ఎక్కువ ఎత్తు ఉంది. బట్... ఆ విషయం జనరల్‌గా చూస్తే తెలియదు. మన మైండ్ మెట్లను చూడగానే... అవి ఇంత హైట్ ఉన్నాయనీ... కాలు ఇంత హైట్ లేవాలనీ ఫిక్స్ చేస్తుంది. అందువల్ల మనం అన్ని మెట్లనీ సమాన హైట్‌తో ఎక్కుతూ వెళ్తాం. అదే ఏదైనా మెట్టు ఎక్కువ ఎత్తు ఉన్నా, తక్కువ ఎత్తు ఉన్నా... తేడా వచ్చేస్తుంది. అప్పుడే పడిపోతాం. ఇక్కడా అదే జరుగుతోంది. ఏళ్లుగా ఆ స్టెప్ అలాగే ఉండిపోయింది. అధికారులు దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రయాణికులు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...