Home /News /trending /

PEOPLE ARE AFRAID TO GO TO THE TEMPLE IN ANANTAPUR DO YOU KNOW WHAT IS IN THE TEMPLE PRV

Animal in Temple: గుడికి వెళ్లాలంటేనే భయపడుతున్న జనం.. ఇంతకీ ఆ గుడిలో ఏముందంటే?

గుడిలో తిరుగుతున్న ఎలుగుబంట్లు

గుడిలో తిరుగుతున్న ఎలుగుబంట్లు

గుడిలోకి ఓ జంతువు(Animal) వచ్చింది. ఒకటేంటి రెండు జంతువులూ వచ్చాయి. ఆ జంతువులను చూసి అక్కడి భక్తులు గుడిలోకి వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. ఇంతకీ ఆ గుడి కథ ఏంటి..

    మనుషులం కదా.. కష్టాలు కామన్​.. అయితే మనిషికి బాధలు, కన్నీళ్లు ఎక్కువైనపుడు ఏం చేస్తారు. స్నేహితుడితోనో, ఎవరైన దగ్గరి వారితోనే చెప్పుకుని చింతిస్తారు. సమస్యలు మరీ ఎక్కువైతే ఇక గుర్తొచ్చేది దేవుడు(god) మాత్రమే. తనను గట్టేక్కించమంటూ భగవంతుడిని వేడుకుంటారు. మరికొందరు ప్రశాంతత కోసం గుడులు(temples), గోపురాల చుట్టూ తిరుగుతుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇంకొందరైతే చేసిన పాపాలు తొలగించమంటూ పొర్లు దండాలు పెడుతూ తిరుగుతుంటారు. అయితే, ఒక గ్రామంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాత్రం గుడి(temple) అంటేనే జంకుతున్నారు. గుడి పేరు వింటేనే వారి గుండెలదురుతున్నాయి. టెంపుల్‌కి వెళ్లాలంటే భయపడిపోతున్నారు(fear). మరీ ఇంతలా భయపడిపోవడానికి కారణమేంటి. వారికి ఏమైనా దయ్యాలు, భూతాలు ఆవహించాయా ఏంటి? లేక మరేదైనా కారణం ఉందా? అవును పెద్ద సమస్యే వచ్చి పడింది. గుడిలోకి ఓ జంతువు(Animal) వచ్చింది. ఒకటేంటి రెండు జంతువులూ వచ్చాయి. ఆ జంతువులను చూసి అక్కడి భక్తులు గుడిలోకి వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. ఇంతకీ ఆ గుడి కథ ఏంటి.. అక్కడికి వచ్చిన జంతువులేంటి?  పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    ఈ ఫొటోను చూస్తే మీకేమనిపిస్తుంది. గుడి ముందు ఏదో నల్లగా తిరుగాడుతున్నట్లుగా కనిపిస్తోంది కదూ. సడెన్‌గా చూస్తే అదేదో వింత ఆకారంలో ఉంది. గుడి తలుపుల ముందు నిలబడి ఆ తలుపులను గట్టిగా నెడుతోంది. అదేంటా అని క్లియర్‌గా పరిశీలిస్తే.. ఎలుగుబంటి అని తేలింది. ఆలయంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి(bear) గుడి తలుపుల ముందు కలియతిరిగింది. అదంతా  ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా బయటికి రావడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

    ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. అనంతపురం జిల్లా రోల్ల మండలంలో జేరిగేపల్లి రామజమ్మ ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారంటే భక్తులకు విపరీతమైన నమ్మకం. కానీ, గుడికి వెళ్లి అమ్మవారిని పూజిద్దామంటే.. అక్కడ రెండు ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. అడవి నుంచి వచ్చిన ఈ ఎలుగు బంట్లు ఆలయ ప్రాంగణంలోకి నిత్యం వస్తుండటంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. సీసీ కెమెరా(cc camera)లో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఊరి జనం భయాందోళనకు గురవుతున్నారు. క్రూర మృగాల సంచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలోనూ చత్తీస్​ఘర్​లోని చండీమాత ఆలయంలోకి రెండు ఎలుగుబంట్లు వచ్చాయి. వాటికి రాము, జంబూలుగా అక్కడి వారు నామకరణం చేశారు. ఆ ఎలుగుబంట్లు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాయట. పూజారి వాటికి ప్రసాదం ఇచ్చి మరీ పంపించడం గమనార్హం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Animal Lovers, Devotional, Temple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు