హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: గవర్నమెంట్ ఆఫీస్ కిటికీలు, తలుపులు, ఫర్నీచర్ అమ్ముకున్న ప్యూన్.. కిక్కు కోసమే..!

Viral News: గవర్నమెంట్ ఆఫీస్ కిటికీలు, తలుపులు, ఫర్నీచర్ అమ్ముకున్న ప్యూన్.. కిక్కు కోసమే..!

Viral News: గవర్నమెంట్ ఆఫీస్ కిటికీలు, తలుపులు, ఫర్నీచర్ అమ్ముకున్న ప్యూన్.. కిక్కు కోసమే..!

Viral News: గవర్నమెంట్ ఆఫీస్ కిటికీలు, తలుపులు, ఫర్నీచర్ అమ్ముకున్న ప్యూన్.. కిక్కు కోసమే..!

Viral News: ఓ ప్రబుద్ధుడు ఏకంగా మూతబడిన తన ఆఫీస్‌ ఫర్నీచర్, ఫైల్స్, కిటికీలు, తలుపులు అమ్ముకున్నాడు. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌ను బంగారు బాతులా మార్చుకున్న ఈ వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కూటి కోసం కోటి విద్యలు అనే సామెత చాలామందికి తెలిసే ఉంటుంది. పొట్ట నింపుకోవడానికి ఎలాంటి పనైనా చేస్తుంటారు అనేది దీని అర్థం. అయితే ఇప్పుడు ఆల్కహాల్ (Alcohol) కిక్కు కోసం కోటి విద్యలు చేయొచ్చని నిరూపించాడు ఒడిశా (Odisha)కు చెందిన ఒక గవర్నమెంట్ ఆఫీస్ ప్యూన్ (Goverment Office Peon). మందు తాగడానికి డబ్బులు లేక ఈ ప్రబుద్ధుడు ఏకంగా మూతబడిన తన ఆఫీస్‌ ఫర్నీచర్, ఫైల్స్, కిటికీలు, తలుపులు అమ్ముకున్నాడు. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్‌ను బంగారు బాతులా మార్చుకున్న ఈ వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మందు తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా ఇలా చేస్తున్నట్లు అతడు చెప్పడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలో 1948లో స్థాపించిన డిస్ట్రిక్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విభాగం, బెర్హంపూర్ నగరంలోని ఒక భవనం కేంద్రంగా పనిచేస్తోంది. ఇటీవల DI ఆఫీస్ పేరును డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్‌ ఆఫీస్‌గా మార్చారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఆఫీస్‌ను రెండు సంవత్సరాల క్రితం కొత్త భవనానికి మార్చారు.

దీంతో పాత ఆఫీస్‌ను మూసివేశారు. అయితే పాత ఫైల్స్‌ అన్నీ అక్కడే ఉండటంతో, ఈ ఆఫీస్ పర్యవేక్షణ బాధ్యతలను ప్యూన్ M పీతాంబర్‌కు అప్పగించి, అతడిని వాచ్ అండ్ గార్డుగా నియమించారు. అప్పటి నుంచి అధికారులు గానీ, సందర్శకులు గానీ పాత ఆఫీస్‌కు వెళ్లడం లేదు.

* మాయమైన ఫైళ్లు, ఫర్నీచర్

అయితే కొన్ని పాత ఫైళ్ల కోసం ఇటీవల ఈ ఆఫీస్‌కు వెళ్లారు విద్యాశాఖ సెక్షన్ ఆఫీసర్ జయంత్ కుమార్ సాహు. లోపలికి వెళ్లిన జయంత్, ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉండాల్సిన పాత ఫైళ్లు, అల్మారాలు, ఫర్నీచర్ అన్నీ మాయమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి బెర్హంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సందర్భంగా కీలక వివరాలు రాబట్టారు బెర్హంపూర్ పోలీసులు. ఆఫీస్ ఫర్నీచర్‌ను వాచ్‌ గార్డు పీతాంబర్‌ అమ్ముకున్నట్లు గుర్తించి, శనివారం అతడిని అరెస్టు చేశారు.

* మందు కోసం డబ్బులు లేక..

ఆఫీస్ మూసివేసిన రెండేళ్లలో పీతాంబర్ స్క్రాప్ డీలర్లకు ఇక్కడి సామాన్లు అమ్ముకున్నట్లు పోలీసులకు చెప్పాడు. మద్యం కొనుగోలు చేసేందుకు మొత్తం 35 అల్మారాలు, 10 సెట్ల కుర్చీలు, బల్లలు సహా ఫైళ్లు, ఫర్నీచర్ అన్నీ అమ్మినట్లు వెల్లడించాడు. కొన్ని తలుపులు, కిటికీలను కూడా పాత సామాన్ల డీలర్లకు అమ్ముకున్నాడు.

ఇది కూడా చదవండి : పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డ్ ఉంటేనే దావత్ కు పర్మిషన్.. వీడియో వైరల్..

పీతాంబర్ చెప్పిన వివరాల ప్రకారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు స్క్రాప్ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. పీతాంబర్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి బినితా సేనాపతి తెలిపారు. ఈ విషయంపై శాఖాపరమైన విచారణ నిర్వహిస్తామని చెప్పారు.ఆఫీసుకు కాపాలాగా ఉండాల్సిన ఈ వ్యక్తి.. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు రెచ్చిపోయాడు. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకొని జైలుకు వెళ్లాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Alcohol, National News, Odisha, VIRAL NEWS

ఉత్తమ కథలు