Home /News /trending /

PENNSYLVANIAS ALFREDOS PIZZA CAFE IN SCRANTON IS SUING A US MAN AFTER HE TIPPED A WAITRESS RS 2 3 LAKH AND LATER DEMANDED IT BACK GH SRD

Tip Amount: బడాయికి పోయి టిప్పుగా రూ.2.3 లక్షలు ఇచ్చాడు.. ఇప్పుడు తిరిగి అడుక్కుంటున్నాడు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tip Amount: సాధారణంగా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు వెయిటర్స్‌కి ఎంతోకొంత టిప్ (Tip) ఇస్తుంటారు కస్టమర్లు. ఒక్కోసారి కొందరు వేలు లేదా లక్షల్లో టిప్స్‌ అందించి వెయిటర్స్‌ని ఖుషి చేస్తుంటారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి మాత్రం తాను ఓ లేడీ సర్వర్‌కి ఇచ్చిన టిప్‌ను తిరిగి అడుక్కుంటున్నాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సాధారణంగా రెస్టారెంట్‌ (Restaurant)కి వెళ్లినప్పుడు వెయిటర్స్‌కి ఎంతోకొంత టిప్ (Tip) ఇస్తుంటారు కస్టమర్లు. ఒక్కోసారి కొందరు వేలు లేదా లక్షల్లో టిప్స్‌ అందించి వెయిటర్స్‌ని ఖుషి చేస్తుంటారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి మాత్రం తాను ఓ లేడీ సర్వర్‌కి ఇచ్చిన టిప్‌ను తిరిగి అడుక్కుంటున్నాడు. అమెరికా (America)కు చెందిన ఈ వ్యక్తి ఇటీవల పెన్సిల్వేనియాలో ఉన్న ఒక పిజ్జా కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ ఏదో తిన్న తర్వాత తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిట్రెస్‌ (Waitress)కు 3,000 డాలర్లు టిప్‌గా ఇచ్చాడు. అంత డబ్బు ఒకేసారి తనకు టిప్‌గా లభించడంతో ఆ లేడీ సర్వర్ కూడా బాగా సంతోషపడిపోయింది. అయితే ఆమె సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎందుకంటే ఆ కస్టమర్ ఇప్పుడు 3,000 డాలర్లు తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో రెస్టారెంట్ యాజమాన్యం అతనిపై ఒక కేసు చేసింది. వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో ఉన్న ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబెర్ట్ అనే యువతి వెయిట్రెస్‌గా పని చేస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో ఆ కేఫ్‌కు ఎరిక్ స్మిత్‌ అనే ఒక వ్యక్తి వచ్చాడు. 13.25 డాలర్ల విలువైన స్ట్రోంబోలి ఆర్డర్ చేశాడు. అది తిన్న తర్వాత బిల్లును పే చేసే సమయంలో క్రెడిట్ కార్డు ద్వారా 3,000 (రూ. 2.3 లక్షలు) డాలర్లు టిప్‌గా ఆఫర్ చేశాడు. ఈ టిప్ "Tips For Jesus" అనే సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో భాగంగా ఇచ్చానని పేర్కొన్నాడు. అయితే ఆ అమౌంట్ చూసి వెయిట్రెస్‌ మరియానా ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. తర్వాత ఎరిక్ స్మిత్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ అమౌంట్‌ను రెస్టారెంట్ యాజమాన్యం నుంచి తీసేసుకుంది. * అసలు కథ ఏంటంటే.. మొదటగా కేఫ్ ఓనర్లు ఇంత పెద్ద టిప్ అమౌంట్ చూసి కాస్త అనుమానించారు. కానీ ఎరిక్ క్రెడిట్ కార్డు నుంచి టిప్ అమౌంట్ తమ ఖాతాలో జమ కావడంతో దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే ఈ టిప్ అమౌంట్ విషయంలో కస్టమర్ ఎరిక్ తన క్రెడిట్ కార్డు ప్రొవైడర్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఈ డబ్బు తాను ఎవరికీ ఇవ్వలేదని, తన డబ్బు తనకి తిరిగి ఇవ్వాల్సిందేనని కోర్టులో ఒక కేసు కూడా ఫైల్ చేశాడు. మూడు నెలల తర్వాత ఈ వివాదం గురించి కేఫ్‌ యాజమాన్యానికి తెలిసింది. అప్పటిదాకా తమవద్ద పనిచేసే వెయిట్రెస్‌కి ఎరిక్ గొప్ప సహాయం చేశాడని సంతోషపడిన వారికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయింది. ఇది కూడా చదవండి : గుడిలో హైటెక్ రోబో.. పూజ మండపం వద్ద సేవలు.. దీని ప్రత్యేకతలు ఇవే.. * కోర్టుకు చేరిన వివాదం ఈ విషయమై ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఫేస్‌బుక్ ద్వారా ఎరిక్‌తో మాట్లాడటానికి ప్రయత్నించింది. ఇదంతా ఒక మిస్‌కమ్యూనికేషన్ వల్ల జరిగినట్లు తెలపాలని అనుకుంది. కానీ ఎరిక్ సరిగా రెస్పాండ్ కాలేదు. కావాలంటే కోర్టులో కేసు వేసుకోండని ఉచిత సలహా ఇచ్చాడు. దాంతో రెస్టారెంట్ యాజమాన్యం మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఆశ్రయించి అతడిపై కేసు నమోదు చేసింది. కోర్టులో తన వెయిట్రెస్‌కి అనుకూలంగా తీర్పు వస్తే తాము తిరిగి 3000 డాలర్లు చెల్లించాల్సిన అవసరం రాదని కేఫ్ యాజమాన్యం అంటోంది. ఈ ఘటన తమకు బాగా చికాకు పెట్టిస్తోందని చెబుతోంది. కోర్టు తీర్పు తమకు అనుగుణంగా రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా ఈ వ్యవహారమంతా ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: America, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు