హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వెయిట్రస్ కి రూ. 2.3 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. కోర్టుకెళ్తామంటున్న రెస్టారెంట్ సిబ్బంది..

వెయిట్రస్ కి రూ. 2.3 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. కోర్టుకెళ్తామంటున్న రెస్టారెంట్ సిబ్బంది..

మరియానా లాంబార్ట్ (ఫైల్)

మరియానా లాంబార్ట్ (ఫైల్)

Viral news:  కస్టమర్ వెయిటర్ సర్వీస్ పట్ల ఎంతో సాటిస్ ఫై అయ్యాడు. దీంతో అతగాడు.. ఆమెకు ఏకంగా 2 లక్షలకు పైగా టిప్ ను ఇచ్చి వెళ్లాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

మనం తరచుగా కుటుంబం లేదా ఫ్రెండ్స్ తో కలిసి హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్తుంటాం. అక్కడ మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి మరీ లాగించేస్తుంటాం. కొందరు వెయిటర్ లు తొందరగా ఆర్డర్ తీసుకువస్తారు. కస్టమర్ లకు చికాకు కల్గకుండా చూసుకుంటారు. దీంతో కస్టమర్ వారి బిల్ కట్టేటప్పుడు వెయిటర్ కు మంచి సర్ ప్రైజ్ ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు తమ హోదా, తాహాతను బట్టి టిప్ లు ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పెన్సిల్వేనియాలోని ఒక రెస్టారెంట్ లో ఆశ్చర్యపోయే ఘటన సంభవించింది. స్క్రాంటన్ లో ఉన్న ఆల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్‌లో మరియానా లాంబార్ట్, వెయిట్రస్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఒకరోజు ఎరిక్ స్మిత్‌ కస్టమర్ వచ్చాడు. అతడు ఆమెకు.. 3,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 2.3 లక్షలు టిప్ గా ఇచ్చాడు. ఎరిక్ కేవలం $13.25కి ఫుడ్ ఆర్డర్ చేశారు. కానీ వెయిట్రెస్ కోసం అదనంగా 3 వేల డాలర్లు తన క్రెడిట్ కార్డ్‌పై చెల్లించారు. తను చేసిన పనికి వేల డాలర్లు ఇచ్చారని వెయిట్రస్ మరియానా లాంబెర్ట్ ఎంతో పొంగిపోయింది.

అయితే ఎరిక్ ఇది సోషల్ మీడియా (Social media) ఉద్యమంలో భాగమని పేర్కొంటూ బిల్లులో టిప్స్ ఫర్ జీసస్ అని రాశారు. ఇది కాస్తా వివాదాస్పదం అయింది. ఈ క్రమంలో రెస్టారెంట్ ప్రతినిధులు సోషల్ మీడియాలో ద్వారా స్మిత్‌ను కలుసుకున్నారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మూడు నెలలు కావస్తున్నా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. కస్టమర్ తాను దావాలో గెలిచి తన డబ్బును తిరిగి పొందగలనని నమ్ముతాడు. ఇంతలో, మేనేజర్ వెయిట్రెస్‌ని డబ్బుకు అర్హమైన కష్టపడి పనిచేసే వ్యక్తిగా అభివర్ణించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా (Viral news) మారింది.

ఇదిలా ఉండగా యూరప్‌(Europe)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం పోర్చుగల్‌(Portugal)కు వెళ్లాల్సి ఉంది, అయితే అది స్పెయిన్‌(Spain)కు చేరుకుంది. తర్వాత అతి కష్టం మీద బస్సులో ప్రయాణికులను పోర్చుగల్ పంపించారు. ఇదంతా విన్న తర్వాత మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఈ మొత్తం ఘటనను విమానంలోని ప్రయాణికుడు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకున్నాడు.

శుక్రవారం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నుంచి పోర్చుగల్‌లోని ఫారోకి వెళ్లిందేకు ర్యాన్ ఎయిర్‌(Ryanair) విమానం బయల్దేరింది. విమానంలో 157మంది ఉన్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం పోర్చుగల్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ అది స్పెయిన్ లోని మలాగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. పోర్చుగల్ వెళ్దామని విమానమెక్కిన ప్రయాణికులు తాము దిగింది స్పెయిన్ లో అని తెలుసుకొని బిత్తరపోయారు. ఇదేంటని విమాన సిబ్బందిని నిలదీశారు. ఆ తర్వాత ర్యాన్ ఎయిర్‌ సంస్థ ఓ బస్సుని ఏర్పాటు చేసి అందులో 157మందిని రోడ్డు మార్గంలో పోర్చుగల్‌కు పంపించారు. అంతేకాదు వీరందరినీ బోర్డర్ దగ్గర మరో బస్సులో కూర్చోబెట్టారు. రోడ్డు మార్గంలో ఐదు గంటల ప్రయాణం తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సదరు విమాన ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: United states, VIRAL NEWS

ఉత్తమ కథలు