Home /News /trending /

PEBBLES ARE COMING OUT WITH TEARS FROM THE LEFT EYE OF A TEENAGER SSR

Viral Video: ఇదెక్కడి చిత్రం.. ఈ బాలిక ఎడమ కంటి నుంచి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..

బాలిక కంటిలో నుంచి రాయి బయటికొస్తున్న దృశ్యం

బాలిక కంటిలో నుంచి రాయి బయటికొస్తున్న దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలికకు వింత సమస్య వచ్చి పడింది. ఎవరైనా ఏడ్చినా, బాధపడినా కళ్లలో నుంచి కన్నీళ్లు మాత్రమే బయటకు వస్తాయి. కానీ ఈ బాలిక పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆ బాలిక కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం.. ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలికకు వింత సమస్య వచ్చి పడింది. ఎవరైనా ఏడ్చినా, బాధపడినా కళ్లలో నుంచి కన్నీళ్లు మాత్రమే బయటకు వస్తాయి. కానీ ఈ బాలిక పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆ బాలిక కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం.. ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా వస్తున్నాయి. వినడానికి వింతగా అనిపించినా ఇది పచ్చి నిజం. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ పరిధిలోని గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో చాందిని అనే 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు ఈ సమస్య నుంచి బాలికను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చాలా ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెకు ఈ సమస్య ఎప్పటి నుంచో లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకొస్తున్నాయి.

    కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక నరకయాతన అనుభవిస్తోంది. కన్ను ఎంతో సున్నితమైంది. అలాంటి కంటి నుంచి.. అది కూడా ఎవరో చెప్పినట్టు కేవలం ఎడమ కంటి నుంచే రాళ్లు వస్తుండటంతో ఆమెకు వచ్చిన సమస్య ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అలా రాళ్లు కళ్లలో నుంచి వస్తుండటంతో ఆమె ఎడమ కన్ను ఎర్రగా, ఎంతో నొప్పిగా ఉంటోందని చాందిని చెబుతోంది.

    ఆమె తండ్రి ముస్తాక్ ఈ సమస్య గురించి మాట్లాడుతూ.. ఆమె కంటికి ఏమైందో తెలుసుకునేందుకు తమ కూతురికి సీతాపూర్, రోహిల్‌ఖండ్, బరేలీలోని చాలా కంటి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించామని.. ఏ డాక్టర్ కూడా కచ్చితంగా సమస్య ఇది అని చెప్పలేకపోయారని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నౌజ్‌కు చెందిన ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఇలాంటి కేసును తాను చూడలేదని చెప్పారు.

    ఇది కూడా చదవండి: Doctor Wife: ఈ డాక్టర్ బాబు భార్య మాములు ముదురు కాదుగా.. కుర్రాడిని కౌగిలిలో బంధించి.. భర్త పక్కన ఫొటోలకు ఫోజులిచ్చి..

    ఈ బాలికకు వచ్చిన సమస్యను గుర్తించి.. ప్రభుత్వం సాయం చేయాలని.. తమ కూతురిని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని ఈ పేద కుటుంబం కోరుతోంది. అయితే.. గతంలో కూడా ఇలాంటి సమస్యలు కొందరిలో కనిపించిన సందర్భాలున్నాయి. కానీ.. రెండు కళ్ల నుంచి చిన్నచిన్న రాళ్లలా పడేవి. ఈ బాలికకు మాత్రం కేవలం ఒక కంటి నుంచి మాత్రమే రాళ్లు పడుతుండటం కొసమెరుపు. సరైన వైద్యం అందిస్తే చాందినిని ఈ సమస్య నుంచి గట్టెక్కించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం చాందినికి ప్రముఖ కంటి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించి, ఆ బాలికను కాపాడాలని కోరుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Trending videos, Uttar pradesh, VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు