Pune: అక్కడి అధికారులు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ ను సేకరించడానికి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చిన వారికి.. తిరిగి వడా పావ్, టీ ఇస్తున్నారు.
Vada pav in exchange for plastic bottles: ప్రస్తుతం దేశంలో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీనిలో ప్రధానంగా వాహానాల నుంచి వెలువడే పొగ, ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు ఉన్నాయి. వీటితో పాటు.. ప్లాస్టిక్ భూతం కూడా విపరీతమైన కాలుష్యానికి కారణమవుతుంది. మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు.. ప్లాస్టిక్ ను బీభత్సంగా వాడతాము.. పొద్దున పాల ప్యాకెట్ నుంచి, రాత్రి ఇంటికి తీసుకెళ్లే సరుకుల వరకు ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ను ఉపయోగిస్తుంటాం.
ప్రధానంగా, ప్లాస్టిక్ భూమిలో కలసి పోవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. అదే విధంగా, ప్లాస్టిక్ ను కాల్చినప్పుడు వెలువడే వాయువులు పర్యావరణానికి పెను ప్రమాదంగా మారాయి. ఇప్పటికి ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని ఎన్నో సదస్సులు, సమావేశాలు జరిగాయి. ఎవరెన్ని చెప్పిన ఇప్పటికి ప్రజల్లో మార్పులు రావడం లేదు. అయితే, మహారాష్ట్రలోని పూణా కు చెందిన మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ప్లాస్టిక్ స్వీకరించడానికి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్లాస్టిక్ బాటిళ్లను ఇచ్చిన వారికి.. తిరిగి వడపావ్, టీ ఇస్తున్నారు.
పూర్తి వివరాలు.. పూణాలోని పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ అధికారులు వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీరు ప్లాస్టిక్ ను అరికట్టడానికి కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా.. పూణాలో పరిధిలో మూడు స్టాళ్లను ఏర్పాటు చేశారు. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఇచ్చి.. వడపావ్ ను ఉచితంగా తీసుకొండని ప్రచారం చేశారు. దీంతో .. చాలా మంది రోజు ప్లాస్టిక్ బాటిల్స్ ను తీసుకొచ్చి.. వడపావ్, టీ తీసుకెళ్తున్నారు. ఈ ప్రత్యేక స్టాళ్లకు పింప్రి చించ్ వాడ్ మున్సిపల్ కార్పోరేషన్ నిధులను సమకూరుస్తుంది.
అలా స్వీకరించిన ప్లాస్టిక్ ను తిరిగి కంపెనీలకు రీసైక్లింగ్ కి పంపుతున్నారు. దీంతో ప్రజలు.. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ ను పారేయడం మానుకొంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా.. యశ్ వంత్ రావ్ ఛవన్ మార్గ్ పింప్రి, కేశవ్ నగర్ శాస్త్రినగర్ కాసర్ వాడి, సంత్ గజానన్ మందిర్ చించ్ వాడలో శాఖలను నెలకొల్పామని చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ రాయ్ తెలిపారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల స్టాళ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.