Paytm: పేటీఎంకు ఆ దుకాణంతో ప్రత్యేక అనుబంధం.. ఎందుకో తెలుసా..?

Paytm: భారత్ లో నోట్ల రద్దు తర్వాత మార్కెట్ లోకి దూసుకొచ్చిన నగదు చెల్లింపుల యాప్ పేటీఎం ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. మారుమూల గ్రామానికి వెళ్లినా చిన్నపాటి కిరాణా కొట్టులోనూ పేటీఎం క్యూఆర్ కోడ్ ఉంది. మరి అది తొలి క్యూఆర్ కోడ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో తెలుసుకుందాం.

news18
Updated: October 2, 2020, 6:57 PM IST
Paytm: పేటీఎంకు ఆ దుకాణంతో ప్రత్యేక అనుబంధం.. ఎందుకో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 2, 2020, 6:57 PM IST
  • Share this:
వేయి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవ్వాల్సిందే.. ఎన్ని కష్టాలకోర్చి శిఖరాన్ని చేరినా మొదటి అడుగును మరిచిపోవద్దంటారు పెద్దలు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్లు భారత్ కూడా రూపాంతరం చెందుతున్నది. ఈ క్రమంలో ఐదేండ్ల క్రితం ప్రధాని మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తో.. దేశంలో నగదు చెల్లింపుల రూపురేఖలే మారిపోయాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్ దాకా చెల్లింపుల విధానమే మారింది. ఈ క్రమంలో ముందుగా నిలిచేది పేటీఎం.

2015లో ప్రారంభమైన ఈ సంస్థకు.. నోట్ల రద్దుతో దశ తిరిగింది. ఇవాళ దేశంలో సక్సెస్ ఫుల్ కంపెనీలలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఒక చిన్నపాటి విప్లవాన్ని తీసుకొచ్చిన పేటీఎం.. తన మొట్టమొదటి సారిగా ఈ విధానాన్ని వినియోగించిన షాప్ హర్యానాలో ఉంది.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పేటీఎం క్యూఆర్ కోడ్ బేస్డ్ పేమెంట్స్) కుమార్ ఆదిత్య వెల్లడించారు. ఆయన ఒక ట్వీట్ చేస్తూ.. ‘2015 సెప్టెంబర్ 29న పేటీఎం క్యూఆర్ కోడ్ ను ఉపయోగించిన షాప్ ఇదే..’ అంటూ ట్వీట్ చేశారు. పేటీఎం సీఈవో, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, మరో ఉపాధ్యక్షురాలు రేణు సట్టికి ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు.





దీనిపై విజయ్ శేఖర్ స్పందిస్తూ... ‘ప్రతి విప్లవానికి వినయపూర్వక ప్రారంభం ఉంటుంది’ అని రాస్తూ.. కుమార్ ఆదిత్య ట్వీట్ ను జతచేసి షేర్ చేశారు. ఇక దీనికి పలువురు ట్విట్టర్ యూజర్లు స్పందిస్తూ... 5 వసంతాలు పూర్తి చేసుకున్న పేటీఎంకు శుభాకాంక్షలు అని రిప్లైలు ఇస్తున్నారు. ‘మీరు చాలా తక్కువ కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు’ అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.

దేశంలో ఇవాళ పేటీఎం క్యూఆర్ కోడ్ లేని దుకాణం ఉందంటే అతిశయోక్తి కాదు. గ్రామాల్లో సైతం ఐదు రూపాయల వస్తువు కొనడానికి కూడా ప్రజలు పేటీఎం ద్వారానే చెల్లిస్తున్నారు. ఇక పట్టణాల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఒక అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది షాప్ యజమానులు పేటీఎంను వాడుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది. దీంతో 2017లో పేటీఎం క్యూఆర్ కోడ్ ల వ్యాపారంలో రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.
Published by: Srinivas Munigala
First published: October 2, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading