హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

జైలుజీవితం చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కొన్ని గంటలపాటు జైల్లో ఉండోచ్చు.. ఎక్కడో తెలుసా..

జైలుజీవితం చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కొన్ని గంటలపాటు జైల్లో ఉండోచ్చు.. ఎక్కడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttarakhand: జైలు అధికారులు కొన్ని గంటల పాటు, నిజంగా తప్పు చేసి జైలులో వచ్చిన వారి లాగా గడిపే అవకాశం కల్పించారు. అచ్చం వీరిని కూడా ఖైదీలకు ఉండే ప్రత్యేకమైన బ్యారక్ లు, దుస్తులు కూడా ఇస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

మనలో కొందరికి జైళ్లలో ఖైదీలు ఎలా ఉంటారు. అధికారులు వారిని ఎలా ట్రీట్ చేస్తుంటారో తెలుసుకొవాలని అనుకుంటారు. అయితే.. వీరు ఏదైన కార్యక్రమాల సమయంలో జైళ్లకు వెళ్తుంటారు.అక్కడ ములాఖత్ లో ఖైదీలతో మాట్లాడుతుంటారు. ఇదిలా ఉండగా ఉత్తరఖండ్ ప్రభుత్వం కొత్తగా జైలులోనే కొన్ని గంటల పాటు ఉండటానికి వెసులుబాటు కల్పిస్తు నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తరఖండ్ లోని (Uttarakhand)  ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు జ్యోతిష్యులు జాతకంలోని దోషాలు పోవాలంటే కొన్ని ఉపచారాలు చేప్తుంటారు. అవి పాటిస్తే దోషాలు పోతాయని బాధితులకు చెప్తారు. ఇదిలా ఉండగా కొందరి జాతకంలో ఉన్న దోషాల వలన వారు జైలు జీవితం గడిపితే జాతకంలో దోషాలు పోతాయి.అయితే.. ఎవరు కూడా జైలుకు వెళ్లాలని అనుకోరు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలాంటి దోషాలు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. జాతకంలో దోషాలు ఉన్నవారు.. కోరుకుంటే.. వారు రూ. 500 చెల్లించి కొన్ని గంటల పాటు జైలులో ఉండడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో వీరికి ప్రత్యేకంగా జైలులో గదులను కేటాయిస్తారు.

ఖైదీలకు మాదిరిగా బట్టలు కూడా ఇస్తారు. తొలిసారిగా దీన్ని హల్ద్వానీ జైలులో ప్రారంభిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని జైలు పరిపాలన ప్రజలు ఒక రాత్రికి రూ. 500 రుసుముతో "చెడు కర్మ" నుంచి బయటపడటానికి నిజ జీవిత జైలు అనుభవాన్ని అందిస్తోంది. 1903లో నిర్మించిన హల్ద్వానీ జైలులో ఆరు సిబ్బంది క్వార్టర్‌లతో కూడిన పాత ఆయుధశాల ఉంది. వదిలివేసిన భాగాన్ని "జైలు అతిథులు" కోసం సిద్ధం చేస్తున్నట్లు జైలు డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ సతీష్ సుఖిజా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, "సిఫార్సు చేయబడిన వ్యక్తులను" జైలు బ్యారక్‌లో కొన్ని గంటలు గడపడానికి అనుమతించమని జైలుకు తరచుగా సీనియర్ అధికారుల నుండి "ఆదేశాలు" అందుతున్నాయి. ఈ "పర్యాటక ఖైదీలకు" జైలు యూనిఫారాలు మరియు జైలు వంటగదిలో తయారు చేయబడిన ఆహారం అందించబడతాయని సీనియర్ పోలీసులు తెలిపారు.

దీనిపై.. హల్ద్వానీకి చెందిన మృత్యుంజయ్ ఓజా అనే జ్యోతిష్కుడు ఇలా అన్నాడు. "కొందరి జాతకంలో లేదా జన్మ చార్ట్‌లో శని, అంగారకుడితో సహా మూడు ఖగోళ వస్తువులు అననుకూల స్థితిలో ఉంచబడినప్పుడు, అది వ్యక్తి జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని అంచనా వేసే సమీకరణంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మేము సాధారణంగా ఒక రాత్రి జైలులో గడపమని, ఖైదీలకు భోజనం అందించమని సలహా ఇస్తామని అన్నారు. ఇలా చేయడం వలన.. గ్రహాల స్థానాల చెడు ప్రభావాలను దాటవేయవచ్చని జ్యోతిష్యుడు పేర్కొన్నాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Jails, Uttarakhand, VIRAL NEWS

ఉత్తమ కథలు