HOME »NEWS »TRENDING »pay rs 12 premium per year and get rs 2 lakh accidental insurance with pmsby scheme ss

PMSBY: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు రూ.12 చెల్లిస్తే చాలు... వివరాలివే

PMSBY: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు రూ.12 చెల్లిస్తే చాలు... వివరాలివే
PMSBY: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు రూ.12 చెల్లిస్తే చాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

PMSBY Scheme | 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు.

  • Share this:
    ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీలో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోవాలంటే ఏడాదికి ప్రీమియం వేలల్లో చెల్లించాలి. కానీ రూ.2 లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్‌కి ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఇది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన సామాజిక సురక్ష పథకం ఇది. వార్షిక ప్రీమియం కేవలం రూ.12 చెల్లిస్తే చాలు రూ.2 లక్షల బీమా లభిస్తుంది. నిరుపేదలు, తక్కువ ఆదాయం పొందే వర్గాలకు ఉపయోగపడే బీమా పథకం ఇది. ఇప్పటికే పాలసీలు ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. వారికి బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. అన్ని బ్యాంకులూ PMSBY పథకాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ఈ పథకంలో చేరారు. వారికి ప్రతీ ఏటా మే 31లోపు ప్రీమియం బ్యాంకు అకౌంట్‌లోంచి కట్ అవుతుంది.

    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో లాభాలు ఇవే...


    ఇది ప్రమాద బీమా పథకం. ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరినవాళ్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు వస్తాయి. శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్ష బీమా అందిస్తుంది ప్రభుత్వం. పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా లభిస్తుంది. గుండెపోటు, సహజ మరణాలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తించదు. కేవలం ప్రమాదాల్లో మరణాలకు మాత్రమే వర్తిస్తుంది.


    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఎవరు చేరొచ్చు?


    18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు. లేదా మీరే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. వార్షిక ప్రీమియం రూ.12. ప్రతీ ఏటా ఈ బీమా పథకం రెన్యువల్ అవుతుంది. ఇప్పటికే మీరు ఈ పథకంలో చేరినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.12 ఉండేలా చూసుకోవాలి. ప్రతీ ఏటా మే 25 నుంచి మే 31 మధ్య అకౌంట్‌లోంచి ప్రీమియం డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి. బీమా పథకం జూన్ 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది.

    Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

    LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

    SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
    First published:May 25, 2019, 19:06 IST