• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PAWRIHORIHAI MEMES TRENDING AFTER 19 YEAR OLD PAKISTAN GIRL 4 SECONDS VIDEO GETTING VIRAL HERE IS KANGANA RANAUT VERSION HSN GH

Kangana Ranaut- Pawrihorihai: 4 సెకెండ్ల వీడియోతో ఇంటర్నెట్ లో సెన్సేషన్.. చూస్తే పగలబడి నవ్వటం ఖాయం..

Kangana Ranaut- Pawrihorihai: 4 సెకెండ్ల వీడియోతో ఇంటర్నెట్ లో సెన్సేషన్.. చూస్తే పగలబడి నవ్వటం ఖాయం..

ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి సాత్పురా టైగర్ రిజర్వ్ లో విహరిస్తున్న కంగనా

ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయిన ఓ పాకిస్థానీ కథ వింటే మీరు పడీపడీ నవ్వుతారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో, హ్యాష్ ట్యాగ్ #Pawrihorihai కథ ఇది. Pawri అన్న వైరల్ మీమ్, వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.

  • Share this:
సామాన్యులను హీరోలుగా.. సెలబ్రిటీలను జీరోలుగా.. రాత్రికి రాత్రే శక్తి ఇంటర్నెట్ కు ఉంది. అలా ప్రస్తుతం ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయిన ఓ పాకిస్థానీ కథ వింటే మీరు పడీపడీ నవ్వుతారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో, హ్యాష్ ట్యాగ్ #Pawrihorihai కథ ఇది. Pawri అన్న వైరల్ మీమ్, వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. పాకిస్థానీ ఇన్ ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన దాననీర్ మొబీన్ "పారీ(Pawri)" వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటున్నాయి. 19 ఏళ్ల మొబీన్ తన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. “యే హమారీ కార్ హై.. ఔర్ యే హమ్ హై, ఔర్ యే హమారీ పారీ హోరీ హై” అంటూ.. తమ కారులో తాము పార్టీ చేసుకుంటున్నట్టు చెప్పుకురావటం చూస్తే నవ్వు ఆగదు.



చెప్పింది సింపుల్ విషయమే అయినా చెప్పిన పద్ధతి చూస్తే పగలబడి నవ్వుతారు. ట్విట్టర్ లో శరవేగంగా షేర్ అవుతూ, ట్రెండింగ్ అయిన ఈ నాలుగు సెకెన్ల వీడియో కంగన రనౌత్ కు సైతం బాగా నచ్చినట్టుంది. అందుకే ఈ వీడియోపై తాను కూడా పారీ హోరీ హై అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలింది. కంగన తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి సాత్పురా టైగర్ రిజర్వ్ లో విహరిస్తూ పారీ హోరీ హై అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మొత్తానికి ప్యారీ మాటలతో ఈ పారీకి మంచి ఇమేజ్ వచ్చిపడిందన్నమాట. మండే బ్లూస్ ను తరిమేసేలా ఇప్పుడిది నవ్వులు పంచుతోంది. మొబీన్ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో కూడా దీన్ని పోస్ట్ చేసింది. ఈ ఒక్క వీడియోకు అప్పుడే మిలియన్ల వ్యూస్ ను తెచ్చి పెట్టగా మొబీన్ ఇప్పుడు పాపులర్ అయిపోయింది.




ట్విట్టర్ లో పారీ హోరీ హై
ట్విట్టరాటీలు ప్రస్తుతం #Pawrihoraihai అంటూ ట్వీట్ చేస్తూ సందడి చేస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్ యష్రాజ్ ముఖాతే కూడా దీనిపై ఫన్నీ ర్యాప్ చేసి వదిలారు. ఇందులో ..“ఆజ్ సే మే పార్టీ నహీ కరూంగా సిర్ఫ్ పారీ కరూంగా.. క్యోంకీ పార్టీ కర్నేమే వో మజా నహీ జో పారీ కర్నేమే హై ”(ఈరోజు నుంచి నేను పార్టీ చేసుకోను. పారీ చేసుకుంటాను. పారీ చేసుకోవడంలోని మజా పార్టీలో లేదు) అంటూ అందరినీ నవ్వించారు. ఆమె ఎవరో కానీ చాలా బాగుంది.. అంటూ ఓ నెటిజన్ ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది.. అంటూ మరో నెటిజన్.. ఇలా తమకు తోచినట్టు ట్వీట్ చేస్తూ, రీట్వీట్ చేస్తూ, పోస్టులు పెడుతూ, ఫన్నీ మీమ్స్ తో తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు కూడా. ఏదేమైనా ఇండో-పాక్ నెటిజన్స్ మధ్య ఇటీవలి కాలంలో ఇలాంటి పోస్టులు ఎక్కువయ్యాయి. సరిహద్దు గొడవలతో తీరిక లేకుండా ఉన్న పాక్ సైన్యంతో సంబంధం లేకుండా పాకిస్థానీ యూత్ మాత్రం ఇలాంటివి చేస్తూ ఇటు ఇండియన్స్ ను కూడా ఆకట్టుకుంటూ ఉండటం హైలైట్.
Published by:Hasaan Kandula
First published:

అగ్ర కథనాలు