• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • PASTOR SITS ON PATIENT FACE AND FARTS ON THEM TO HEAL FROM ALL TYPE OF DISEASES IN SOUTH AFRICA PHOTOS GOES VIRAL SK GH

Viral News: ఇదెక్కడి విడ్డూరం.. ఈ పాస్టర్ గ్యాస్ వదిలితే రోగాలన్నీ పోతాయట..

పాస్టర్ ప్రినిలోప్ (Facebook/SevenFold Holy Spirit Ministries)

బైబిల్‌లో ఉన్న స‌మాచారాన్ని కూడా త‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మార్చుకుంటున్నాడు ఈ పాస్టర్. ''ఏసు క్రీస్తు పీట‌ర్‌పై కాలు మోపిన‌ప్పుడే ఈ మహిమ మొద‌ల‌య్యింది. ఇది దేవుని మ‌హిమ‌ను చూపించ‌డ‌మే'' అని అంటున్నాడు.

  • Share this:
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు గానీ.. ఈ పాస్టర్ పిత్తులకు అన్ని రోగాలు మటు మాయం అవుతాయట. అవును.. వింత ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటారు. మూఢనమ్మకాలను నమ్మేవారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ఆ నమ్మకం మనల్ని ఎంతటి జుగుప్సాకరమైన పనులు చేయిస్తాయో అని ఆలోచించడం కూడా మర్చిపోతున్నారు వాళ్లు.. ఈ పాస్టర్ పనులను నమ్మే వాళ్లు కూడా అలాంటివారే.. మంచి కంటే చెడుకు పాపులారిటీ ఎక్కువ కాబ‌ట్టి ఈ అయ్య‌వారి చేష్ట‌లు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌ గా మారి, న‌వ్వుతో పాటు వికారాన్నీ పుట్టిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రైస్ట్ పినిలోప్ అనే పాస్ట‌ర్ త‌న‌దైన స్టైల్‌ల్లో అమాయ‌క ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షిస్తున్నాడు. త‌మ‌కున్న‌ స‌మ‌స్య‌లు తీర్చ‌మ‌ని ఈయ‌న‌ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంటే, వారి ముఖాల‌పై ఒక పిత్తు పిత్తేసి, `ఇక హాయిగా బ‌తికేయండి, దీని మ‌హిమ‌తో మీ స‌మ‌స్య‌ల‌న్నీ మ‌టుమాయ‌మ‌య్యాయ‌ని` అభ‌య‌హ‌స్తం ఇస్తున్నాడు.

ఇలా ఆయ‌న క‌డుపులో కంపుని జ‌నాల‌పై ఒలికిస్తున్న పినిలోప్‌ ద‌గ్గ‌ర‌కు జ‌నాలు తండొప‌తండాలుగా వ‌స్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈయ‌న పిత్తు ప్రాప్తం కోసం రెండు మూడు నెల‌లు ప‌డిగాపులు కాసే జ‌నాలున్నారంటే అర్థం చేసుకోండి పాస్ట‌ర్ గారి ప‌లుకుబ‌డి ఎంత‌గా ఉందో! అంతేకాదు, డైరెక్ట్‌గా త‌మ మొఖాల‌పై పిత్తించుకోవ‌డం కుద‌ర‌క‌పోతే ఆ కంపు పంట్టేంత కంటైన‌ర్లు తెచ్చుకొని మ‌రీ మోసుకెళ్తున్నారంటా ఆ భాగ్యాన్ని! ఇలాంటి జనాలుంటే ఇక పాస్టర్ ఆగుతాడా..

ఇంతకీ ఇందులో ఉన్న లాజిక్ ఏంటని అయ్య‌వారిని అడిగితే, ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారి మొఖాల‌పై కూర్చొని, వారి ముక్కుకు ద‌గ్గ‌ర‌గా హోలీ స్పిరిట్‌ ని వ‌దలుతున్నానని అంటాడు. అంటే పిత్తు (Fart) రూపంలో ఉన్న ప‌విత్రాత్మ ముక్కు ద్వారా వారిలోకి వెళ్లి, వారిని స్వ‌స్థ‌ప‌‌రుస్తుందంట‌. అందుకే ఈయ‌న పిత్తుకి అద్భుతాలు చేసే శ‌క్తి ఉందంటాడు. ఇదే అంద‌రి ఆధ్యాత్మిక‌, శారీర‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతుందని చెబుతాడు.

బైబిల్‌లో ఉన్న స‌మాచారాన్ని కూడా త‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మార్చుకుంటున్నాడు ఈ పాస్టర్. ''ఏసు క్రీస్తు పీట‌ర్‌పై కాలు మోపిన‌ప్పుడే ఈ మహిమ మొద‌ల‌య్యింది. ఇది దేవుని మ‌హిమ‌ను చూపించ‌డ‌మే'' అని అంటున్నాడు. అలాగే దేవుడు ఆదామును చేసి, గాఢ నిద్ర‌లోకి పంప‌డం లాంటిదేన‌ని, అంత నిద్ర‌లో ఆదాము దేహంతో ఆదాముకి తెలియ‌కుండానే మ‌హిమ‌లు చేసి చూప‌డం లాంటిదే ఈ ప‌ని కూడా అంటూ త‌న‌దైన శైలిలో లాజిక్‌లు సృష్టిస్తున్నాడు.

మొత్తానికి ఇంట‌ర్నెట్‌‌లో ఈయ‌న‌గారి ఫొటోలు వైర‌ల్ అయిన త‌ర్వాత‌, ఇత‌గాడి చేష్ట‌ల‌ను మిగ‌తా పాస్ట‌ర్లు తీవ్రంగా ఖండించారు. ఆయ‌న జ‌నాల‌పైన పిత్తే మాట అటుంచితే, అస‌లు మ‌నుషుల‌పై కూర్చొని, ఏవో అద్భుతాలు చేస్తున్నామ‌ని బొంక‌ట‌మే చాలా త‌ప్పు అంటున్నారు. కాగిసో ప్రాంతానికి చెందిన పాస్ట‌ర్ జాక‌బ్ సిబియా దీనిపై మీడియాలో స్పందిస్తూ.. ''ఇది చాలా త‌ప్పు. దేవుడు ఎక్క‌డా మ‌న‌నుషుల‌పై కూర్చుంటే స్వ‌స్థ‌త క‌లుగుతుంద‌ని చెప్ప‌లేదు. పాస్ట‌ర్లు బైబిల్‌లో ఏముందో దాన్ని పాటించాలి త‌ప్ప‌, వాళ్ల ఆలోచ‌న‌లు బైబిల్‌లో ఉంటాయ‌నుకోకూడ‌దు.'' అంటూ హిత‌వు ప‌లికారు.

మ‌నుషులు ఎంత నాగ‌రిక‌త‌ను నేర్చుకున్నా మూఢ‌న‌మ్మ‌కాలు వారిని మూర్ఖులుగానే ఉంచుతున్నాయి. అంత‌కుమించి, మాయ‌లు నేర్చిన కేటుగాళ్లు ప్ర‌జ‌ల్లో ఉన్న ఈ అమాయ‌క‌త్వాన్నే సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే రోజురోజుకీ దొంగ స్వాములూ, ఫేక్ బాబాలు, చీట్ చేసే పాస్ట‌ర్లూ ఎక్కువ‌వుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: