ప్రయాణాల్లో దోపిడీ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఛార్జీల పేరుతో ప్రయాణికుల్ని బాదేస్తారు. ప్రభుత్వ రవాణా సంస్థలైతే సమయాపాలన లేకుండా ఇబ్బంది పెడతారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైల్వే లాంటి పెద్ద రవాణా సంస్థల్లో దోపిడీ వేరే స్టైల్లో ఉంటుంది. తక్కువ ఛార్జీతో సురక్షితమైన ప్రయాణం చేయవచ్చని భావించే వారికి రైళ్లలో ఆహార పదార్ధాలు, తినుబండారాలు విక్రయించే వాళ్ల రూపంలో దోపిడీ చేస్తుంటారు. రైళ్లలో ప్రయాణం చేస్తున్న వాళ్లు మీకో సూచన. ప్యాసింజర్ (Passenger)ఎక్స్‌ప్రెస్ ట్రైన్(express train)లో లాంగ్ జర్నీ చేస్తున్నారా. అయితే ట్రైన్‌లో ఏదైనా తినే పదార్ధాలు విక్రయించడానికి వస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయండి. లేదంటే డబ్బుతో పాటు మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్(Danapur Express Train)లో విచిత్రమైన సంఘటన జరిగింది. రైల్వే క్యాంటిన్(Railway Canteen)లో తయారు చేసిన ఆలు సమోసాలు (Samosas)అమ్మేందుకు వచ్చాడు ఓ వ్యక్తి. బోగీ అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆకలితో ఉన్న ప్రయాణికులు సమోసాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ట్రైన్‌లో అమ్ముతున్న ఆలుగడ్డPotato సమోసాలో ఆలుగడ్డలు లేకుండా కేవలం ముక్కిపోయిన బియ్యం(Rice)మిగిలినపోయిన అన్నం పెట్టి తయారు చేసినట్లుగా ఉన్నాయి.
నాసీరకం సమోసాలు విక్రయం..
దానాపూర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారిలో బేతుల్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఇద్దరు యువకులు సమోసాలు కొనుగోలు చేశారు. తినడానికి వాటిని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆలుగడ్డ సమోసాలో ఆలుగడ్డలు పెట్టలేదు కదా..వాటికి బదులు ముక్కిపోయిన బియ్యంతో చేసిన అన్నం పెట్టి తయారు చేశారు. సమోసాల్లో ఉన్న పదార్ధం చూసిన యువకులు సమోసాలు విక్రయించే వ్యక్తినిపై మండిపడ్డారు. ఇలాగేనా తయారు చేసేది..ఇవి తింటే మా ఆరోగ్యాలు ఏమైపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల ప్రాణలతో చెలగాటం..
బోగీలో నాసీరకం సమోసాలపై ప్రయాణికులు పెద్ద ఎత్తున గొడవకు దిగడంతో రైల్వే క్యాంటిన్ మేనేజర్ వచ్చి ప్రయాణికులకు క్షమాపణ చెప్పాడు. ఈ సమోసా తయారు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పారు. సమోసాలు కొనగోలు చేసిన ఇద్దరు యువకులు తమ స్టేజీ నాగ్‌పూర్ రాగానే రైలు దిగిపోయారు. ఈ సమోసా గొడవ జరుగుతుండగా మరో ప్రయాణికుడు జరిగినదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Madhya pradesh, Viral Video