హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral: ట్రైన్‌ను తోస్తున్న ప్రయాణికులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

Video Viral: ట్రైన్‌ను తోస్తున్న ప్రయాణికులు .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

(Photo:Youtube)

(Photo:Youtube)

Video Viral:మొట్టమొదటి సారి రైలు పట్టాలపై ఓ ట్రైన్‌ కోచ్‌ ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు దాన్ని తోసుకెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Barel, India

రోడ్లపై షడన్‌గా వాహనాలు ఆగిపోతే .. నెట్టడం చూశాం. కార్లు, బైక్‌లు, చివరకు బస్సులు కూడా మొరాయిస్తే వాటిని ప్రయాణికులు కొద్ది దూరం వరకు నెట్టుకెళ్లడం చాలా సార్లు వార్తలు వచ్చాయి. కాని మొట్టమొదటి సారి రైలు(Rail) పట్టాలపై ఓ ట్రైన్‌ కోచ్‌ ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు దాన్ని తోసుకెళ్లిన వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా రైల్వేశాఖ(Railways Department)పై కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly )లో ఈ షాకింగ్ వీడియో అందర్ని అలర్ట్ చేస్తోంది.

పట్టాలపై రైల్ కోచ్‌ని తోసుకెళ్తున్న దృశ్యం..

దేశ ఆర్దిక ప్రగతికి ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి రైల్వేశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్రం చెబుతుంటే ..రైలు పట్టాలపై చుక్ చుక్‌ మంటూ దుకెళ్లాల్సిన రైళ్లు మొరాయిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ బరేలీ రైల్వే జంక్షన్‌లో ఓ రైలు కోచ్‌ను పట్టాలపై కొందరు నెట్టుకెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా రోడ్డుపై బస్సులు, పోలీస్ వాహనాలు, అంబులెన్స్‌లు ఆగిపోవడం చూశాం. కాని ఈవిధంగా రైల్వే జంక్షన్‌లోని ఒకటవ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై రైల్ కోచ్‌ పెట్టెను ప్రయాణికులు నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో..

నిత్యం లక్షలాది మంది ప్రయాణికుల్ని గమ్య స్తానాలకు చేరవేసే రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేశాఖ. అలాంటి రవాణా వ్యవస్థలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రైల్వేశాఖను తీవ్రంగా ఎండగడుతున్నారు. వీడియోని సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేస్తూ ఇదెక్కడి విడ్డూరంగా విమర్శలు చేస్తున్నారు.

Shocking News: పెంపుడు కుక్క ఎవర్నైనా కరిస్తే అక్కడ ఎంత ఫైన్ వేస్తున్నారో తెలుసా..?

విమర్శల వెల్లువ..

అయితే ఇదంతా ఎలా జరిగింది..? వీడియో ఎందుకు తీశారు..? పట్టాలపై రైల్ బోగీని నెట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయంపై మాత్రం పూర్తి వివరాలు తెలియలేదు. అయితే వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు ఆ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఇంతలో జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిందని నెటిజన్లు రైల్వేశాఖపై కౌంటర్లు వేస్తున్నారు.

First published:

Tags: Train, Uttar pradesh, Viral Video