రైల్లో పోర్న్ ఆడియో... ఆ అరుపులతో షాకైన వందల మంది ప్రయాణికులు...

Train and Pornography : వాళ్లిద్దరి మధ్యా సెక్స్ సంభాషణ, అరుపులూ ప్రయాణికులకు ఆశ్చర్యం కలిగించాయి. ఓ ప్యాసింజర్ ఆ ఆడియోలో చిన్న క్లిప్పును రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 8:32 AM IST
రైల్లో పోర్న్ ఆడియో... ఆ అరుపులతో షాకైన వందల మంది ప్రయాణికులు...
ట్విట్టర్‌లో వీడియో నుంచీ తీసిన ఇమేజ్ (Image : Paul Brunton / Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 8:32 AM IST
ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా జరగని సంఘటన ఇది. సౌత్ లండన్ ట్రైన్‌లో జరిగింది. రైలు వెళ్తుండగా... డ్రైవర్ తన మొబైల్‌లో ఓ సెక్స్ వీడియోని ప్లే చేశాడు. దానికి సంబంధించిన ఆడియో... అక్కడి సౌండ్ సిస్టంకి కనెక్ట్ అయ్యింది. దాంతో... రైల్లో ఉన్న మొత్తం అన్ని బోగీల్లోనూ ఆ సెక్స్ సంభాషణలు, అరుపులూ ప్రయాణికులకు వినిపించాయి. సడెన్‌గా అలాంటి మాటలు, అరుపులూ వినిపించేసరికి ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని నిమిషాలపాటూ ఈ తతంగంసాగింది. కొంత మంది అవి విని తమలో తాము నవ్వుకున్నారు. కొంత మంది మాత్రం వాట్ ఈజ్ దిస్ రబ్బిష్ అని సీరియస్ అయ్యారు. ప్రయాణికుల్లో ఒకరైన పాల్ బర్టన్... ఆ ఆడియోలో చిన్న క్లిప్పును రికార్డ్ చేసి... ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడా క్లిప్పు వైరల్ అయ్యింది. 17 లక్షల వ్యూస్, 14,500 రీట్వీట్స్, 56వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన ఓ ప్రయాణికుడు... ఆ ఆడియోలో మాటలు ఎవరివి? డ్రైవర్‌వా అని ప్రశ్నించడం మరో కలకలం. మల్టీ టాస్కింగ్ జరుగుతోందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఆ ట్రైన్ వెళ్తుండగా... దాని డ్రైవర్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడన్నమాట. దీనిపై కొంత మంది ప్రయాణికులు మండిపడుతున్నారు. ట్రైన్ డ్రైవింగ్ చేస్తూ... మొబైల్ ఎలా ఆపరేట్ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. ఆ డ్రైవర్‌ని సస్పెండ్ చెయ్యాలని కోరుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి :

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...

రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...