విమానంలో నరకం చూసిన ప్రయాణికులు.. అసలేం జరిగింది?

విమాన ప్రయాణం ఎంత జాలీగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అంతే భయంకరంగా ఉంటుందనే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రయాణికులు ఒక్కసారిగా అస్వస్థతు గురై ప్రత్యక్ష నరకాన్ని చూశారు.

news18-telugu
Updated: February 11, 2019, 7:38 PM IST
విమానంలో నరకం చూసిన ప్రయాణికులు.. అసలేం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 7:38 PM IST
185 మంది ప్రయాణికులతో ఆదివారం మస్కట్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం... హఠాత్తుగా మళ్లీ వెనక్కు వచ్చేసింది. అందులో నుంచి దిగుతున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కొందరికి ముక్కులో నుంచి రక్తం కారుతోంది, మరికొందరు చెవి నొప్పితో బాధపడుతున్నారు. అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే.. విమాన క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా అందులోని ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు అధికారులు గుర్తించారు. విమానంలో ఒక్కసారిగా పీడనం తగ్గిపోవడంతో.. ప్రమాణికుల ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. మరికొందరు తీవ్రమైన చెవినొప్పితో బాధపడ్డారు. విమానం మస్కట్ నుంచి కాలికట్ బయల్దేరిన కొద్దిసేపటికే ఈ పరిస్థితి తలెత్తడంతో.. సిబ్బంది అలర్టయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి మస్కట్‌లో ల్యాండ్ చేశారు.

అస్వస్థతకు గురైన ప్రయాణికులకు మస్కట్ విమానాశ్రయంలోనే చికిత్స అందించారు. వారు పూర్తిగా కోలుకున్నాక విమానం తిరిగి కాలికట్‌కు బయల్దేరి వెళ్లింది. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, కేబిన్‌లో పీడన సమస్య కారణంగానే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, నలుగురికి ముక్కు నుంచి రక్తం కారిందని, మరికొందరు చెవినొప్పితో బాధపడ్డారని ఎయిర్‌లైన్ ప్రతినిధులు తెలిపారు.అందరూ సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...