Video: విమానంలో గబ్బిలం.. బోర్డింగ్ పాస్ తీసుకుందా?

గబ్బిలం దెబ్బకు ప్రయాణికులు హడలిపోతే.. దానిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.

news18-telugu
Updated: August 4, 2019, 8:33 PM IST
Video: విమానంలో గబ్బిలం.. బోర్డింగ్ పాస్ తీసుకుందా?
గబ్బిలం (Image:News18Malayalam
  • Share this:
విమానంలో మనుషులు ప్రయాణిస్తారు. కొన్ని లగేజీ మాత్రమే తీసుకెళ్లే ఫ్లైట్లు కూడా ఉంటాయి. అయితే, అప్పుడప్పుడు విమానాల్లో కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. అమెరికాలోని నార్త్ కరోలినా లో ఉన్న చార్లెట్ విమానాశ్రయం నుంచి న్యూజెర్సీలోని నేవడాకు వెళ్లేందుకు ప్రయాణికులు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. అయితే, అందరూ చూస్తుండగానే ఓ పెద్ద గబ్బిలం ఆ విమానంలోకి దూసుకొచ్చింది. మొదట్నుంచి చివరి వరకు ప్రయాణికుల తలల మీద చక్కర్లు కొట్టింది. సుమారు అరగంట పాటు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులను గబ్బిలం హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గబ్బిలం దెబ్బకు ప్రయాణికులు హడలిపోతే.. దానిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. అసలు గబ్బిలం బోర్డింగ్ పాస్ తీసుకుందా? అంటూ వెటకారం చేస్తున్నారు. మరికొందరు అయితే, ప్రయాణికులు అందరూ వచ్చారో లేదో చెక్ చేసుకోవడానికి వచ్చి ఉంటుందంటూ జోక్స్ వేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 4, 2019, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading