హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: విమానంలో గాల్లో ఉండగా కుప్పకూలిన పైలట్.. కానీ సేఫ్‌గా దిగింది.. నిజంగా అద్భుతం

OMG: విమానంలో గాల్లో ఉండగా కుప్పకూలిన పైలట్.. కానీ సేఫ్‌గా దిగింది.. నిజంగా అద్భుతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Passenger became Pilot: విమానం నడిపే పైలట్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. సీటులోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత విమానం కంట్రోల్ తప్పింది. దానిని గమనించిన ఓ ప్రయాణికుడు భయంతో వణికిపోయాడు. ఆ తర్వాత పైలట్‌గా మారి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ఇంకా చదవండి ...

విమానం ఆకాశంలో దూసుకెళ్లోంది. అందులో ఇద్దరే ఉన్నారు. ఒకరు పైలట్. మరొకరు ప్రయాణికుడు. పైలట్ విమానం నడుపుతుండగా.. ప్రయాణికుడేమో కిటికీలో నుంచి కిందకు చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం నడిపే పైలట్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. సీటులోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత విమానం కంట్రోల్ తప్పింది. దానిని గమనించిన ఓ ప్రయాణికుడు భయంతో వణికిపోయాడు. ఆ తర్వాత పైలట్‌గా మారి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్  (Plane passenger became pilot) చేశాడు. అసలు అతడికి విమానం నడిపిన అనుభవం ఇంతుకు ముందు లేదు. కానీ ఏటీసీ సూచనలతో ఎంతో ధైర్యంగా విమానాన్ని కిందకు దించి.. తనతో పాటు పైలట్ ప్రాణాలు కూడా కాపాడాడు. ఫ్లోరిడా (Florida) అట్లాంటిక్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Mothers love: శభాష్ జ్యోతి.. వట్టి చేతులతో చిరుతతో పోరాడిన తల్లి.. ఎందుకో తెలుసా..?

బహ్‌మాస్‌లోని మార్ష్ హార్బర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి మంగళవారం మధ్యాహ్నం ఓ మినీ ప్లేన్ గాల్లోకి ఎగిరింది. అందులో ఇద్దరే ఉన్నారు. పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం అంది. అందులో పైలట్ ఒక్కరే ఉన్నారు. కోపైలట్ లేడు. విమానం ఫ్లోరిడా మీదుగా వెళ్తున్న సమయంలో.. పైలట్ తీవ్ర అస్వస్థతకు గురై.. సీటులోనే కుప్పకూలిపోయాడు. అతడి పరిస్థితి ఆ ప్రయాణికుడు వెంటనే వాయిస్ రికార్డు పంపించి సాయం కోరాడు. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో విధుల్లో ఉన్న క్రిస్టోఫర్ అతడి మాటలను విన్నారు. అనంతరం ప్యాసింజర్‌తో అతడు మాట్లాడాడు. ''పైలట్ పడిపోయాడు. నాకేమో భయంగా ఉంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మీరే కాపాడాలని'' అని ప్యాసింజర్ చెప్పాడు. ''మీకు విమానం నడిపిన అనుభవం ఉందా.. అని అడిగితే.. అస్సలు తెలియదు.'' అని సమాధానం చెప్పాడు. ''మరేం పర్లేదు.. మేం చెప్పినట్లుగా చేస్తే.. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయొచ్చని'' వివరించాడు. ఇలా అతడి టెన్షన్‌ను దూరం చేశాడు.

Telangana:పెళ్లి వేడుకల్లో రక్తపాతం..భద్రాద్రి జిల్లా బొంబాయి తండాలో ఎస్‌ఐపై దాడి

ప్యాసింజర్ ఫోన్‌ నెంబర్ తెలుసుకొని.. అతడికి కాల్ చేసి.. మరింత స్పష్టతతో మాట్లాడారు. రాబర్ట్ మోర్గాన్ అనే మరో అధికారి ఫోన్ తీసుకొని ప్యాసింజర్తో సంభాషించారు. విమానాలు నడపడంతో పాటు సాంకేతిక అంశాల్లో ఆయనకు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. నీకు ఎదురుగా ఏం కనిపిస్తోందని అడిగితే.. ఫ్లోరిడా తీరం అని చెప్పాడు. ఐతే విమానం రెక్కలు పైకి, కిందకు మారకుండా.. ఇప్పుడు వెళ్తున్న ఎత్తులోనే విమానాన్ని నడపాలని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాటిని తూచా తప్పకుండా అతడు పాటించాడు. కాసేపటి తర్వాత విమానం ఏటీసీకి కనిపించింది. అలా అతడితో మాట్లాడుతూనే.. భోకా రాటన్ ఉత్తర తీరంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించారు. అసలు విమానం నడిపిన అనుభవమే లేకుండా.. చాలా చక్యంగా ల్యాండ్ చేయడంతో.. ఆ ప్యాసింజర్ రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. ఇది నిజమంగా అద్భుతమని ఏటీసీ అధికారులు ప్రశసంలు కురిపించారు. అతడు విమానం ల్యాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం దిగిన వెంటనే అంబులెన్స్‌లో పైలట్‌ను ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడు ఎందుకు పడిపోయాడు? ఏం జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Amercia, Trending, Us news, USA

ఉత్తమ కథలు