Video: మొబైల్ ఎత్తుకుపోయిన చిలుక!.. చివరకు ఏం జరిగిందంటే..

మొబైల్ ఎత్తుకుపోయిన చిలుక! (image credit - twitter)

Viral Video: ఓ చిలుక ఎగురుతూ... తనతో మొబైల్ పట్టుకుపోయినట్లున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మనమూ చూద్దాం. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా ట్విట్టర్ యూజర్ @fred035schultz అలాంటి ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో... ఓ చిలుక మొబైల్ ఎత్తుకుపోయినట్లు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాగా షేర్ అవుతోంది. ఇది ఏకంగా 2 నిమిషాలు ఉండటంతో... చాలా మంది దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో చూస్తే... ఓ వ్యక్తి షాకవుతూ... చిలుకవైపు చూస్తున్నాడు. అప్పటికే ఆ చిలుక అతని మొబైల్ పట్టుకుపోయినట్లు సీన్ ఉంది. అలా మొబైల్ పట్టుకుపోయిన చిలుక... ఎగురుతూ ఎగురుతూ చుట్టుపక్కల ఇళ్లు, చెట్లపై నుంచి వెళ్లింది. చాలా దూరం ఎగిరిన తర్వాత... ఆ చిలుక... ఓ కారుపై వాలడంతో వీడియో ముగుస్తుంది.

    ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టమైన వివరాలు. అసలు నిజంగానే చిలుక మొబైల్ ఎత్తుకుపోయిందా లేక గ్రాఫిక్స్ ద్వారా అలా క్రియేట్ చేశారా అనే డౌట్ కూడా ఉంది. వీడియో క్యాషన్ మాత్రం... "మొబైల్ పట్టుకుపోయన చిలుక... అదిరిపోయే ట్రిప్ వేసింది" అని రాశారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ఇది నిజమేకావచ్చని చాలా మంది ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. లైక్స్, వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఇప్పటికే దీన్ని 11 లక్షల మంది చూశారు. చాలా మంది ఇది జోక్‌లా ఉందంటున్నారు. చిలుక... ఫిల్మ్ మేకర్ అయిపోయిందని ఓ యూజర్ అన్నారు. "అసలా మొబైల్ తిరిగి వెనక్కి ఎలా వచ్చింది... అందులో క్లిప్ ఎలా లభించింది" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "యాపిల్‌ ఫోన్‌లో నా చిలుక ఎక్కడుందో కనిపెట్టు అనే ఫీచర్ ఉందేమో" అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ పర్యావరణహిత డ్రోన్ ఉన్నప్పుడు రియల్ డ్రోన్ అవసరం ఏముంది అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

    మరో యూజర్ మాత్రం "ఇది 100 శాతం యానిమేషనే. పాజ్ చేసి.. పక్షి రెక్కల్ని గమనించండి. వాటి చివరలు గరుకైన అంచెలతో ఉన్నాయి. నిజమైన యానిమేషన్ బ్లర్ అక్కడ లేదు. గ్రౌండ్, ఇళ్ల నీడలు షార్ప్‌గా ఉన్నాయి. చెట్లపై ఆకులు కూడా నిజమైనవిలా లేవు. అన్నీ ఫ్లాట్‌గా ఉన్నాయి. పక్షి వెళ్లిన విధానం కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంది" అని అభిప్రాయపడ్డారు.

    ఇది కూడా చదవండి: Horoscope 28-8-2021: నేటి రాశి ఫలాలు.. ఉద్యోగ ఆఫర్లు.. ఆర్థిక అప్రమత్తత

    మొత్తానికి ఇది నిజమా, అబద్ధమా అనేది తేలలేదు. వీడియో క్లిప్ మాత్రం వైరల్ అయ్యింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే... అంత దూరం ఆ చిలుక మొబైల్ పట్టుకుపోతే... మళ్లీ ఆ మొబైల్ ఎలా దొరికిందని ప్రశ్నిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: