హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: క్యాండిల్ ఆర్పి..కేక్ కట్ చేసిన చిలుక ..వైరల్ అవుతున్న బర్త్ డే వీడియో ఇదే

Viral Video: క్యాండిల్ ఆర్పి..కేక్ కట్ చేసిన చిలుక ..వైరల్ అవుతున్న బర్త్ డే వీడియో ఇదే

parrot birthday(Photo:Youtube)

parrot birthday(Photo:Youtube)

Viral Video: లోకంలో నిత్యం ఏదో చోట వింతలు, విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా అవి జనం కళ్లలో పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే చిలుక పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి దాంతోనే కేక్ కట్ చేయించాడు యజమాని. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India

లోకంలో నిత్యం ఏదో చోట వింతలు, విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా(Social media) వేదికగా అవి జనం కళ్లలో పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే చిలుక(Parrot) పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి దాంతోనే కేక్(Cake) కట్ చేయించాడు యజమాని. అయితే ఇప్పటి వరకు కుక్కలకు పుట్టిన రోజు వేడుకలు, పెంపుడు జంతువులకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కాని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇలా చిలుక పుట్టిన రోజు వేడుకల్ని వేడుకలు ఇప్పుడు వైరల్‌గా మారింది. బర్త్‌డే కేక్‌ను తన ముక్కుతో కట్ చేసిన చిలుక దాన్ని తినడం....అందరూ చప్పట్లు కొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లో వెరైటీ దృశ్యం ..

మధ్యప్రదేశ్ విచిత్రమైన సంఘటన జరిగింది. సురేష్ పవార్ అనే బొగ్గు గని ఉద్యోగి ఇంట్లో కిట్టు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కిట్టుకు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో అడుగుపెట్టడంతో యజమాని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లను పిలిపించి హోలీ పండుగ రోజున వేడుకలు జరిపించాడు. అయితే ఎక్కడైనా బర్త్‌ డే అంటే పిల్లవాడు అందరితో కలిసి భోజనం చేయడం, కలిసి సరదాగా గడపటం, కుటుంబ సభ్యులతో కలిసి పడుకోవడం చూశాం. కాని బైతుల్‌లో జరిగిన బర్త్‌ డే కిట్టు పేరుతో ఉన్న రామచిలుకది కావడంతో ఈవేడుక అందర్ని ఆకర్షిస్తోంది.

గ్రాండ్‌గా చిలుక బర్త్ డే..

సురేష్ పవార్ అనే బొగ్గు గని ఉద్యోగికి నాలుగేళ్ల క్రితం ఓ గిరిజనుడు రామచిలుకను బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి దాన్ని ఇంట్లో పెంచుకుంటున్న యజమానికి దానికి కిట్టు అని పేరు పెట్టాడు. ఈ ఏడాది మార్చి 8వ తారీకుతో కిట్టుకు నాలుగు ఏళ్లు పూర్తై 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో బర్త్ డే వేడుకల్ని గ్రాండ్‌గా అరేంజ్ చేశాడు. బర్త్ డే కేక్ తెప్పించి..క్యాండిల్ విలిగిస్తే ..కిట్టు క్యాండిల్ ఆర్పి..తన ముక్కుతో కేక్‌ను కట్ చేసి కొద్దిగా తిన్నది. అంతే ఇంట్లోని వారంతా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్ డే విషెస్ తెలిపారు.

Investment: భారత్‌లో డబ్బులు సంపాధించే మహిళలు దేనిపై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారో తెలుసా..?

సెలబ్రేషన్స్ వీడియో వైరల్ ..

రామచిలుక పుట్టిన రోజును ఇంత గ్రాండ్‌గా నిర్వహించడంపై యజమానిని స్థానికులు అభినందించారు. మరోవైపు పక్షి కూడా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మూగజీవిపై యజమాని సురేష్‌ పవార్‌ చూపించిన ప్రేమకు జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.

First published:

Tags: Madhya pradesh, National News, Viral Video

ఉత్తమ కథలు