Parle G: పార్లేజీ సంచలన నిర్ణయం.. నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు!

కరోనా మహమ్మారి విజృంభన కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో చాలా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి, మరికొన్ని కంపెనీలు మూతపడ్డాయి.

news18-telugu
Updated: October 12, 2020, 3:38 PM IST
Parle G: పార్లేజీ సంచలన నిర్ణయం.. నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు!
పార్లేజీ
  • Share this:
కరోనా మహమ్మారి విజృంభన కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో చాలా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి, మరికొన్ని కంపెనీలు మూతపడ్డాయి. అయితే, మహమ్మారి సమయంలోనూ పార్లే సంస్థ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. గత ఎనిమిది దశాబ్ధాల్లో ఎప్పుడూ లేనంతగా లాక్డౌన్ అమలైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో పార్టేజీ బిస్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది పార్లేజీ సంస్థపై వినియోగదారుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పవచ్చు.

అయితే, పార్లేజీ సంస్థ తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకొని మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నకిలీ టీఆర్పీ రేటింగుల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. మెరుగైన టీఆర్పీ రేటింగ్స్ కోసం అక్రమాలకు పాల్పడుతున్న పలు న్యూస్ ఛానళ్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో న్యూస్ ఛానళ్లకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపివేస్తూ పార్లే సంస్థ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆదివారం ట్వీట్ చూస్తూ ‘‘న్యూస్ ఛానళ్లు ప్రజలకు విషపూరితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాయనే భావన పార్లేజీ యాజమాన్యంలో వ్యక్తమవుతుంది. ఇటువంటి విషపూరితమైన సమాచారాన్ని పంపే వార్తా ఛానెళ్లకు తాము వాణిజ్య ప్రకటనల రూపంలో డబ్బును ఎందుకు ఇవ్వాలనే అభిప్రాయంతో పార్లే సంస్థ భావిస్తుంది.

అందుకే వాటికి వ్యాపార ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల ఇదే తరహా నిర్ణయాన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ తీసుకుంది. బజాజ్, పార్లే కంపెనీలకు మధ్దతుగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంది. ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ఊహించని విధంగా మద్ధతు లభిస్తుంది.

పార్లేజీ మంచి నిర్ణయం తీసుకుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జీ అంటే జీనియస్, గ్రేట్అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే, అందుబాటు ధరలో నాణ్యమైన బిస్కట్లకు ప్రసిద్ధి అని పార్లే సంస్థపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్లే నిర్ణయంతో ఏకీభవిస్తూ మరిన్ని సంస్థలు ముందుకురావాలని అనేకమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Published by: Sumanth Kanukula
First published: October 12, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading