Viral News: వలలో చిక్కుకున్న ఆ 157 చేపలతో కోటీశ్వరుడు అయ్యాడు.. ఒక్కో చేప ఖరీదు ఎంతంటే..!

Viral News: వలలో చిక్కుకున్న ఆ 157 చేపలతో కోటీశ్వరుడు అయ్యాడు.. ఒక్కో చేప ఖరీదు ఎంతంటే..!

Viral News: పాల్ఘర్‌ (Palghar)లోని ముర్భేకి చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 28న పాల్ఘర్ తీరానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టడం ప్రారంభించాడు. 10 మంది సభ్యులతో కలిసి అతడు వేటకు వెళ్లాడు. ఆ తరువాత అతడి వలకు భారీగా చేపలు చిక్కాయి.

  • Share this:
అదృష్టం ఎ‍ప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈరోజు నిరుపేద అయిన వ్యక్తి రేపు కోటీశ్వరుడు కావచ్చు. ఈ తరహాలో ఇప్పటికే కోటీశ్వరులైన వారెందరో ఉన్నారు. తాజాగా మరొక నిరుపేద మత్స్యకారుడు కూడా ఒక్కరోజులోనే కోటి రూపాయలు సంపాదించాడు. ముంబై-పాల్ఘర్ (Mumbai - Palghar) తీరంలో చేపల వేటకు వెళ్లిన చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడి వలకు ఒకేరోజు రూ.కోట్ల విలువైన చేపలు చిక్కాయి. ఈ విషయం తెలుసుకొని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో అధికారులు నెల రోజుల పాటు చేపలవేట నిషేధించారు. ఆ నిషేధాన్ని ఇటీవల ఎత్తి వేస్తూ చేపలవేటకు అనుమతించడంతో చంద్రకాంత్ సముద్రం మీదకి వేటకు వెళ్ళాడు. అయితే మొదటి రోజే అతడి వలలో 157 ఘోల్ జాతి చేపలు (Ghol fish) చిక్కాయి. ఘోల్ చేపలు అత్యంత ఖరీదైనవి కావడంతో అతడు కోటీశ్వరుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు.

పాల్ఘర్‌ (Palghar)లోని ముర్భేకి చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 28న పాల్ఘర్ తీరానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టడం ప్రారంభించాడు. 10 మంది సభ్యులతో కలిసి అతడు వేటకు వెళ్లాడు.

ఆ తరువాత అతడి వలకు భారీగా చేపలు చిక్కాయి. వీరి బృందంలోని ఒకరు దీనికి సంబంధించిన వీడియోను ఇతరులకు షేర్ చేశారు. దాంతో గంటల వ్యవధిలోనే చుట్టుపక్కల జాలర్ల గ్రామాల్లో ఈ వార్త దావానలంలా వ్యాప్తి చెందింది.

ఇది కూడా చదవండి : " టీమిండియాతో జర జాగ్రత్త.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకపోతే ఇక అంతే సంగతులు "

ఘోల్ రకం చేపలు తన జీవితాన్నే మార్చేస్తాయని చంద్రకాంత్ ఊహించలేకపోయాడు. సముద్ర తీరం నుంచి తిరిగి వస్తుండగా ముర్భేలో వ్యాపారులు అతడి కోసం వరుస కట్టడం చూసి ఆశ్చర్యపోయాడు.

ఈ చేపలను వేలం వేసిన వ్యాపారులు రూ.1.33 కోట్లకు మొత్తం 157 ఘోల్ చేపలను దక్కించుకున్నారు. దాంతో చంద్రకాంత్ ఎవరూ ఊహించని రీతిలో కోటీశ్వరుడయ్యాడు. దాదాపు ఒక్కో చేప రూ. 85,000 వేలు పలికింది.

ఇది కూడా చదవండి :  కీలక పోరు ముందు టీమిండియాను భయపెడుతున్న ఆ చెత్త రికార్డు.. గత 50 ఏళ్లుగా..

ఘోల్ ఫిష్‌కు తూర్పు ఆసియా దేశాల్లో మంచి ధర పలుకుతుంది. ముఖ్యంగా ఇండోనేషియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్, మలేషియాలలో భారీ డిమాండ్ ఉంది. దాని అంతర్గత అవయవాలకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయట. సముద్రపు బంగారంగా పిలిచే ఈ బ్లాక్‌స్పాట్ క్రోకర్ చేపల చర్మం హైక్వాలిటీ కొల్లాజెన్‌ కలిగి ఉంటుంది.

ఫంక్షనల్ ఫుడ్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారీలో కొల్లాజెన్ విరివిగా వాడుతుంటారు. దాని రెక్కలు ఔషధ విలువను కలిగి ఉంటాయి. ఫార్మా కంపెనీలు కరిగే కుట్లు తయారు చేయడానికి ఈ చేపలనే ఉపయోగిస్తుంటారు.
Published by:Sridhar Reddy
First published: