HOME »NEWS »TRENDING »pakistani political leader fazal made humorous comments on the virus bn

మనం నిద్రపోతే.. వైరస్ నిద్రపోతుంది.. పాకిస్థాన్ నేత వ్యాఖ్యలు..

మనం నిద్రపోతే.. వైరస్ నిద్రపోతుంది.. పాకిస్థాన్ నేత వ్యాఖ్యలు..
ప్రతీకాత్మక చిత్రం

మనం ఎక్కువగా నిద్రపోతే.. వైరస్ సైతం నిద్ర పోతుంది. అది మనకు ఏలాంటి హానీ చేయదు. మనం నిద్రపోతే అది నిద్రపోతుంది. మనం చనిపోతే.. అది చనిపోతుంది.’ అంటూ పాకిస్థాన్‌కు చెందిన ఫజల్ ఉర్ రెహమాన్ అనే రాజకీయ నాయకుడు పేర్కొన్నారు.

  • Share this:
    కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. పేద, ధనిక దేశాలన్న తేడా ఏం లేకుండా దాని పేరు వింటేనే వణికిపోతున్నారు. ఆ వైరస్ నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఓ పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏంటంటే.. మనం నిద్రపోతే.. వైరస్ సైతం నిద్రపోతుందట. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘వైద్యులు మనల్ని ఎక్కువగా నిద్రపోవాలని చెబుతుంటారు. మనం ఎక్కువగా నిద్రపోతే.. వైరస్ సైతం నిద్ర పోతుంది. అది మనకు ఏలాంటి హానీ చేయదు. మనం నిద్రపోతే అది నిద్రపోతుంది. మనం చనిపోతే.. అది చనిపోతుంది.’ అంటూ పాకిస్థాన్‌కు చెందిన ఫజల్ ఉర్ రెహమాన్ అనే రాజకీయ నాయకుడు పేర్కొన్నారు.

    అయితే ఫజల్ ఈ వ్యాఖ్యలు ఎప్పడు చేశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇంటర్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సదరు నేతపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ వీడియో క్లిప్పింగ్‌పై ట్విట్టర్‌లో ఓ యువకుడు స్పందిస్తూ.. ఇలాంటి సైన్స్‌ను ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదంటూ వ్యాంగాస్త్రాలు సంధించాడు. మరో వ్యక్తి స్పందిస్తూ బహుశా ఇది చైనా వైరస్ కావడం వల్ల మనల్ని కాపీ కొడుతుండొచ్చు. వైరస్‌కు ఇంత మంచి పరిష్కారం విన్నవారేవరూ ఆత్మహత్య చేసుకోకూడదంటూ కోరాడు.



    Published by:Narsimha Badhini
    First published:June 14, 2020, 19:55 IST