కరువు, ఆర్ధిక సంక్షోభాన్ని ప్రజలు తట్టుకోలేరు. అందుకే భవిష్యత్తును తలచుకొని ముందుగానే జాగ్రత్త పడతారు. పాకిస్థాన్ (Pakistan)లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పాక్‌లో పెట్రోలియం, వంట గ్యాస్ నిల్వలు తగ్గడంతో అక్కడి ప్రజలు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా హంగూ(Hangoo)నగర ప్రజల జీవన పరిస్థితి మరీ దుర్భరంగా ఉన్నట్లు సోషల్ మీడియా(Social media)లో వైరల్ (Viral)అవుతున్న వీడియో(Video)లు చూస్తుంటే అర్ధమవుతోంది. వంట గ్యాస్(Cooking gas)ని ప్లాస్టిక్ కవర్(Plastic cover)లో నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ప్లాస్టిక్ కవర్‌లో గ్యాస్ నిల్వలు..
పాకిస్తాన్‌లో ఆర్ధిక సంక్షోభం అక్కడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే ...ప్రజలు అక్కడ దరిద్ర పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా హంగూ నగరంలో వంట గ్యాస్ కొరత కారణంగా స్తానికులు ప్లాస్టిక్ కవర్‌లలో గ్యాస్‌ని నింపుకుంటున్నారు. పాక్ ప్రజలు ప్రాణాల్ని పణంగా పెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండేళ్లుగా గ్యాస్ లేకుండనే హంగూ ప్రజలు బ్రతుకుతున్నారంటే పరిస్థితులు ఎంత నిస్సహాయంగా ఉన్నాయో అర్దమవుతోంది.
Residents of Karak carry gas for their household needs in plastic bags because there is no natural gas supply to residences. The Pakistani establishment has totally failed here! 1/2@husainhaqqani pic.twitter.com/QBqf0XX1PR
— Tahreem Akhtar (@Tahz42) January 2, 2023
రెండేళ్లుగా గ్యాస్ కనెక్షన్‌లు లేవు..
హంగూ నగరంతో పాటు ఖైబర్, ఫఖ్తుంక్వా జిల్లాలతో పాటు కరక్ జిల్లా ప్రజలు గత రెండేళ్లుగా గ్యాస్ కనెక్షన్‌లు లేకుండానే జీవిస్తున్నారు. అందుకే గ్యాస్‌ని ఈవిధంగా ప్లాస్టిక్ కవర్‌లో నింపుకోవడం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, మీడియాలో వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది.
ఆర్దిక పతనమే కారణమా ..
దేశంలో ప్రజలు ఇంతటి దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటుంటే ..ప్రభుత్వం మాత్రం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇక నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.దీనంతటికి దేశ ద్రవ్యోల్బణం, పెట్రోలిం, గ్యాస్ నిల్వలు తగ్గడంతో పాటు దేశ కరెన్సీ విలువలు కూడా పడిపోవడమే ఇంతటి హీన పరిస్థితులకు కారణమని దేశ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Pakistan, Viral Video